Anemia Food: రక్తహీనత ఉన్న వారికి ఇలా తయారు చేసిన పాలు దివ్యౌషధం
రక్త హీనత.. ఇదేం అంత ప్రమాదకరమైన సమస్య కాదనుకుంటారు చాలామంది. కానీ ఎంత నిర్లక్ష్యం చేస్తే.. అంతకు అంత వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణానికే ముప్పు జరగొచ్చు. దీనినే వైద్య భాషలో అనీమియా అంటారు. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంటుంది. పీరియడ్స్ సమయంలో అధిక రక్త స్రావం అవ్వడం, డెలివరీ సమయంలో ఎక్కువగా రక్తాన్ని కోల్పోవడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఇటీవల కాలంలో చిన్న పిల్లల్లోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యను మొదటిలోనే తగ్గించుకోకపోతే..
రక్త హీనత.. ఇదేం అంత ప్రమాదకరమైన సమస్య కాదనుకుంటారు చాలామంది. కానీ ఎంత నిర్లక్ష్యం చేస్తే.. అంతకు అంత వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణానికే ముప్పు జరగొచ్చు. దీనినే వైద్య భాషలో అనీమియా అంటారు. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంటుంది. పీరియడ్స్ సమయంలో అధిక రక్త స్రావం అవ్వడం, డెలివరీ సమయంలో ఎక్కువగా రక్తాన్ని కోల్పోవడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఇటీవల కాలంలో చిన్న పిల్లల్లోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యను మొదటిలోనే తగ్గించుకోకపోతే.. ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
అనీమియా ఉన్నవారికి నీరసం, తల తిరగడం, రోగనిరోధక శక్తి తగ్గి.. తరచూ అనారోగ్యం బారిన పడటం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం, గోళ్లు పాలిపోవడం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని నుంచి బయట పడాలంటే ఎక్కువగా మందులు మింగడం ఆపి.. రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచే ఆహారాలను తీసుకోవాలి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి.. రక్తహీనతను తగ్గించే.. ఒక డ్రింక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దీనిని తయారు చేసుకునేందుకు పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. పాలు, ఖర్జూరాలు, నెయ్యి ఉంటే చాలు.
ఒక గిన్నెలో గ్లాసు పాలు పోసి.. అందులో ముక్కలుగా కట్ చేసిన ఖర్జూరాలను, రెండు స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి వేసి స్టవ్ పై పెట్టాలి. పాలు కాగి.. ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి.. పాలను చల్లారబెట్టుకోవాలి. చల్లారిన పాలను జార్ లో పోసి.. ఖర్జూరాలు పూర్తిగా పాలలో కలిసేంతవరకూ మిక్సీ పట్టాలి. ఇలా తయారు చేసుకున్న పాలను ఒక గ్లాసులో పోసుకుని తాగాలి. ప్రతిరోజూ పాలను ఇలా తాగితే.. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్త హీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు కూడా ఈ పాలను తాగించవచ్చు. రోజూ తాగలేకపోతే.. వారానికి 2-3 సార్లైనా ఈ పాలు తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి