AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyeliner Side Effects: డైలీ ఐ లైనర్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇవి గుర్తు పెట్టుకోండి!!

సాధారణంగా స్త్రీలకు అందంపై మక్కువ ఎక్కువ. ఆ అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. అందరిలో వారే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలనుకుంటారు. బ్యూటీ పార్లలో వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. స్త్రీల అందంలో కళ్లు కూడా ఒకటి. ఆ కళ్లను మరింత అందంగా మార్చేందుకు కళ్లకు కాటుక, ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా ఐ లైనర్లు కళ్లకు ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న విషయం మీకు తెలుసా? ఐ లైనర్స్ వల్ల కళ్లకు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఐ లైనర్స్ ని ఎలా వాడాలో తెలీదు..

Eyeliner Side Effects: డైలీ ఐ లైనర్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇవి గుర్తు పెట్టుకోండి!!
Eyeliner
Chinni Enni
|

Updated on: Aug 18, 2023 | 12:55 PM

Share

సాధారణంగా స్త్రీలకు అందంపై మక్కువ ఎక్కువ. ఆ అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. అందరిలో వారే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలనుకుంటారు. బ్యూటీ పార్లలో వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. స్త్రీల అందంలో కళ్లు కూడా ఒకటి. ఆ కళ్లను మరింత అందంగా మార్చేందుకు కళ్లకు కాటుక, ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా ఐ లైనర్లు కళ్లకు ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న విషయం మీకు తెలుసా?

ఐ లైనర్స్ వల్ల కళ్లకు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఐ లైనర్స్ ని ఎలా వాడాలో తెలీదు.. అలాగే ఎలా రిమూవ్ చేయాలో కూడా తెలీదు. ఇష్టానుసారంగా వాడుతూ ఉంటారు. దీంతో కళ్లు మసక బారినట్లు ఉండటం, కళ్ల కింద మండటం, కళ్లల్లో మంట వంటి ప్రమాదాలు వస్తాయి. మరి ఎలాంటి ఐ లైనర్స్ వాడాలి? ఎలా వాడితే సేఫ్టీనో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐ లైనర్స్ ని అయితే వాడుతూ ఉంటారు కానీ.. దాన్ని ఎలా శుభ్రం చేయాలో తెలియక నానా తిప్పలు పడుతూ ఉంటారు. కొందరు కాటన్ తో తీస్తారు. మరికొందరు నూనె రాసి, సబ్బుతో కడుగుతారు. ఐ లైనర్లను వాడటమే కాదు దాన్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా నిపుణుల నుంచి తెలుసుకోవడం ఉత్తమం. లేకుంటే కళ్లు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చాలా మంది లిక్విడ్ ఐ లైనర్స్ ని ఉపయోగిస్తారు. ఇది ఎంత మాత్రం సేఫ్టీ కాదని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే ఐ లైనర్లను వాడతారో వారు పడుకునే ముందు ఖచ్చితంగా.. ఐ లైనర్ ని తొలగించి శుభ్రంగా కళ్లను కడుక్కొని పడుకోవాలి. రాత్రి పూట ఐ లైనర్ ను  రిమూవ్ చేయకుండా ఉంచడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో.. సోషల్ మీడియాలో పలు వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

ఐ లైనర్లు వాటర్ లైన్ ప్రాంతంలో అప్లై చేయడం వల్ల అక్కడ ఉండే గ్రంథులు సరిగా నూనెలను ఉత్తత్తి చేయలేవు. అవి సరిగా పని చేయని కారణంగా కళ్లకు సంబంధించి అనేక సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు లిక్విడ్ ఐ లైనర్లను వాడకపోవడమే బెటర్. ఒకవేళ వాడినా.. నీటిగా క్లీన్ చేసుకుంటే మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!