AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quick Breakfast with Poha: అటుకులతో దోసెలు.. చిటికెలో చేసుకుని తినేయండి!!

ఈ రోజుల్లో పిల్లలు తినడానికి అనేక రకాల చిరుతిండ్లు వచ్చాయి. వాటితో పాటే రోగాలు కూడా వస్తున్నాయి. కానీ.. మన చిన్నప్పుడు అంటే.. 90ల కాలంలో చిరుతిండ్లు అంటే.. మురమరాలు, పేలాలు, అటుకులు ఇవే ఉండేవి. సాయంత్రం వేళ.. అమ్మ వంటింట్లోని డబ్బాల్లో దాచిపెట్టిన మురమరాల ఉండలో, అటుకులతో చేసిన పాయసం, వేయించిన పేలాలు, మురమరాలతో అమ్మ తయారు చేసిన బేల్ పూరి ఇవే ఉండేవి. కానీ ఇప్పుడు నెలల తరబడి ప్యాకెట్లలో నిల్వచేసిన చిప్స్, ఇతరత్రావే ఎక్కువగా తింటూ..

Quick Breakfast with Poha: అటుకులతో దోసెలు.. చిటికెలో చేసుకుని తినేయండి!!
Poha Dosa
Follow us
Chinni Enni

|

Updated on: Aug 17, 2023 | 9:29 PM

ఈ రోజుల్లో పిల్లలు తినడానికి అనేక రకాల చిరుతిండ్లు వచ్చాయి. వాటితో పాటే రోగాలు కూడా వస్తున్నాయి. కానీ.. మన చిన్నప్పుడు అంటే.. 90ల కాలంలో చిరుతిండ్లు అంటే.. మురమరాలు, పేలాలు, అటుకులు ఇవే ఉండేవి. సాయంత్రం వేళ.. అమ్మ వంటింట్లోని డబ్బాల్లో దాచిపెట్టిన మురమరాల ఉండలో, అటుకులతో చేసిన పాయసం, వేయించిన పేలాలు, మురమరాలతో అమ్మ తయారు చేసిన బేల్ పూరి ఇవే ఉండేవి. కానీ ఇప్పుడు నెలల తరబడి ప్యాకెట్లలో నిల్వచేసిన చిప్స్, ఇతరత్రావే ఎక్కువగా తింటూ.. అనారోగ్యాల పాలవుతున్నారు.

అటుకులను కూడా బియ్యంతోనే తయారు చేస్తారు. వీటితో పాయసం, పోహ, ఉప్మా వంటివి చేసుకుని తింటుంటాం. అలాగే.. అటుకులను వేయించుకుని స్నాక్ ఐటమ్ గా కూడా తింటాం. కానీ ఎప్పుడైనా అటుకులతో దోసెలు ట్రై చేశారా ? బ్రేక్ ఫాస్ట్ అంటే.. ఇడ్లీ, మినపదోసె, ఉప్మా, పెసరట్టు కాకుండా.. ఇలా అటుకులతో అప్పటికప్పుడు వేడివేడి దోసెలు వేసుకుని .. అందులోకి అల్లం చట్నీ, పల్లీ చట్నీ కలిపి తింటే.. ఎలా ఉంటుంది? చెబుతుంటేనే నోటిలో నీళ్లూరుతున్నాయ్ కదూ. ఇంకెందుకు లేటు.. అటుకుల దోసెలు ఎలా తయారు చేసుకోవాలో.. అందుకు ఏవేం కావాలో చూద్దాం.

అటుకుల దోసెల తయారీకి కావలసిన పదార్థాలు:

ఇవి కూడా చదవండి

ఒక కప్పు అటుకులు, ఒక కప్పు బొంబాయిరవ్వ, ఒక కప్పు పెరుగు, ఉప్పు – తగినంత, ఒక కప్పు నీళ్లు, చిటికెడు – బేకింగ్ సోడా

తయారీ విధానం:

ఒక గిన్నెలో పైన తెలిపిన క్వాంటిటీలో అటుకులు, బొంబాయిరవ్వ, పెరుగు కలిపి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఈ మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీరుపోసి.. దోసె పిండికి కావలసినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుుకోవాలి. దోసెలు వచ్చేలా పిండిని కలుపుకున్నాక.. స్టవ్ పై పెనం పెట్టి.. అది వేడయ్యాక దోసెలు వేసుకోవడమే. అటుకుల దోసెలు రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ఓ సారి ట్రై చేసి.. టేస్ట్ చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి