Tender Coconut MilkShake: కొబ్బరి మిల్క్ షేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా ?
లేత కొబ్బరైతే.. ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా మంది లేత కొబ్బరిలో పంచదారతో కలిపి తింటుంటారు. బయట కొబ్బరి బోండాం తాగినపుడు.. అందులో లేత కొబ్బరి కనిపిస్తే.. అడిగి మరీ ఆ కొబ్బరిని తీయించుకుని తింటారు. లేతకొబ్బరి అంత బాగుంటుంది మరి. శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. కొబ్బరినీళ్లు, లేతకొబ్బరి, కొబ్బరితో రకరకాల వంటకాల వరకూ ఓకే. మరి మీరెప్పుడైనా కొబ్బరి మిల్క్ షేక్ తాగారా ? ఇదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా ? కొబ్బరి మిల్క్ షేక్ అంటే కొబ్బరి..
కొబ్బరి పేరు చెప్పగానే.. చాలా రకాల ఆహార పదార్థాలు గుర్తొస్తాయ్. కొబ్బరి లడ్డూలు, కొబ్బరి పచ్చడి, కొబ్బరి కూర, కొబ్బరి-పల్లీ చట్నీ, కొబ్బరి అన్నం, కొబ్బరి బిర్యానీ.. ఇలా చాలా మందికి కొబ్బరితో తయారు చేసే వివిధ రకాల ఆహార పదార్థాలంటే చాలా ఇష్టం. సాంబార్ లో కూడా కొబ్బరి పొడిని వాడితే.. ఆ రుచే వేరు. వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి కలుపుకుని తింటే.. ఆహా! అనాల్సిందే. కొబ్బరిని వంటల్లోనే కాదు.. పచ్చికొబ్బరి కూడా తినేయొచ్చు.
లేత కొబ్బరైతే.. ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా మంది లేత కొబ్బరిలో పంచదారతో కలిపి తింటుంటారు. బయట కొబ్బరి బోండాం తాగినపుడు.. అందులో లేత కొబ్బరి కనిపిస్తే.. అడిగి మరీ ఆ కొబ్బరిని తీయించుకుని తింటారు. లేతకొబ్బరి అంత బాగుంటుంది మరి. శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. కొబ్బరినీళ్లు, లేతకొబ్బరి, కొబ్బరితో రకరకాల వంటకాల వరకూ ఓకే. మరి మీరెప్పుడైనా కొబ్బరి మిల్క్ షేక్ తాగారా ? ఇదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా ? కొబ్బరి మిల్క్ షేక్ అంటే కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్, లేతకొబ్బరి వేసి మిక్స్ చేసేసి తాగేయటం కాదు. అదెలా చేసుకోవాలో.. అందుకు ఏమేం కావాలో చూద్దాం రండి.
కొబ్బరి మిల్క్ షేక్ తయారీకి కావలసిన పదార్థాలు:
చల్లని పాలు – 1/2 గ్లాసు, కొబ్బరి నీళ్లు – 1 గ్లాసు, పంచదార – 1 కప్పు, లేత కొబ్బరి – 1 కప్పు
తయారీ విధానం:
ఒక జార్ లో పంచదార, లేతకొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాలు, కొబ్బరి నీళ్లు పోసి 3 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. అంతే కొబ్బరి మిల్క్ షేక్ రెడీ. ఈ షేక్ ను గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకుని ఎంచక్కా తాగేయడమే. ఇంకొంచెం చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఈ కోకొనట్ మిల్క్ షేక్ శరీరంలో వేడిని, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి