AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kitchen hacks: రోజూ చిటికెడు ఈ పొడితో కొవ్వు మొత్తం కరిగిపోతుంది!!

అధిక బరువు.. ఈ కాలంలో ఫలానా వయసు వారికే ఈ సమస్య ఉందనడానికి లేదు. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మంది ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏ పని చేసినా అలసట, ఎక్కువ దూరం నడవలేక పోవడం, నడిస్తే ఆయాసం రావడం, అధికంగా చెమటలు పట్టడం వంటివి ఫేస్ చేస్తున్నారు. కొందరికి ఊబకాయం థైరాయిడ్ వల్ల వస్తే.. మరికొందరు మాత్రం ఏరికోరి కొని తెచ్చుకుంటున్నారు. అవసరానికి మించి ఆహారం తినడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం..

kitchen hacks: రోజూ చిటికెడు ఈ పొడితో కొవ్వు మొత్తం కరిగిపోతుంది!!
Flax Seeds Powdwer
Chinni Enni
|

Updated on: Aug 17, 2023 | 7:59 PM

Share

అధిక బరువు.. ఈ కాలంలో ఫలానా వయసు వారికే ఈ సమస్య ఉందనడానికి లేదు. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మంది ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏ పని చేసినా అలసట, ఎక్కువ దూరం నడవలేక పోవడం, నడిస్తే ఆయాసం రావడం, అధికంగా చెమటలు పట్టడం వంటివి ఫేస్ చేస్తున్నారు. కొందరికి ఊబకాయం థైరాయిడ్ వల్ల వస్తే.. మరికొందరు మాత్రం ఏరికోరి కొని తెచ్చుకుంటున్నారు. అవసరానికి మించి ఆహారం తినడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వంటి వాటివల్ల అధిక బరువు సమస్య తలెత్తుతోంది.

బరువు పెరగడం వల్ల చిన్న వయసులోనే అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. గుండె జబ్బులు, బీపీ, షుగర్, హార్మోన్ల అసమతుల్యత.. ఇలా వివిధ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ఏదైనా శరీరానికి సరిపడేవి, సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేదంటే చాలా అనర్థాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో పొడులను తయారు చేసుకుని వాడటం వల్ల.. 10 రోజుల్లోనే మీ శరీరంలో వచ్చే మార్పును గమనించవచ్చు. శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు, పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అలాగని వ్యాయామాలు చేయనక్కర్లేదనుకుంటే పొరపాటే. అవి చేస్తూనే.. ఈ పొడిని కూడా వాడాలి. ఇంతకీ ఆ పొడి ఏంటి ? ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

అధిక బరువును తగ్గించే ఈ పొడిని తయారు చేసుకునేందుకు.. అవిసె గింజలు, జీలకర్ర, సోంపు గింజలు, కరివేపాకు తీసుకోవాలి. ఒక కళాయిలో ఒక కప్పు అవిసెగింజలు, అర కప్పు జీలకర్ర, పావుకప్పు సోంపు గింజలు, ఒక కప్పు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత జార్ లో వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి గాలి తగలకుండా ఉండేలా గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ మోతాదులో ఈ పొడిని కలుపుకుని తాగాలి. క్రమం తప్పకుండా ఈ పొడిని నీటిలో కలిపి తాగితే.. మీ శరీరంలో పేరుకున్న కొవ్వు.. నిదానంగా కరిగిపోతుంది. అధిక బరువు సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి