Side effects of Glass Containers: గాజు పాత్రల్లో వండిన, నిల్వచేసిన ఆహారాలను తింటున్నారా ? అయితే జాగ్రత్త!

ప్రతి రోజూ ఇంట్లో వంటలను వండేందుకు వివిధ రకాల పాత్రలను ఉపయోగిస్తుంటాం. స్టీల్, అల్యూమినియం, రాగి, నాన్ స్టిక్, మట్టి పాత్రలను ఉపయోగిస్తుంటాం. వీటిలో మట్టిపాత్రలు మినహా.. మిగతా ఏ పాత్రల్లో ఆహారాన్ని వండినా ఆరోగ్యానికి హానికరమే. అది తెలిసి కూడా మనం వాటిలోనే వండుకుంటాం. మన జీవన శైలి దానికే అలవాటు పడిపోయింది. కొందరు లోహాలతో తయారు చేసిన పాత్రలకంటే.. గాజుతో తయారు చేసిన వాటిలో వండితే ఏమీ కాదని భావించి.. వాటిలో వంటలు చేస్తున్నారు. చేసిన వంటల్ని కూడా గాజుపాత్రల్లోనే..

Side effects of Glass Containers: గాజు పాత్రల్లో వండిన, నిల్వచేసిన ఆహారాలను తింటున్నారా ? అయితే జాగ్రత్త!
Glass Containers Side effects
Follow us
Chinni Enni

|

Updated on: Aug 19, 2023 | 2:19 PM

ప్రతి రోజూ ఇంట్లో వంటలను వండేందుకు వివిధ రకాల పాత్రలను ఉపయోగిస్తుంటాం. స్టీల్, అల్యూమినియం, రాగి, నాన్ స్టిక్, మట్టి పాత్రలను ఉపయోగిస్తుంటాం. వీటిలో మట్టిపాత్రలు మినహా.. మిగతా ఏ పాత్రల్లో ఆహారాన్ని వండినా ఆరోగ్యానికి హానికరమే. అది తెలిసి కూడా మనం వాటిలోనే వండుకుంటాం. మన జీవన శైలి దానికే అలవాటు పడిపోయింది. కొందరు లోహాలతో తయారు చేసిన పాత్రలకంటే.. గాజుతో తయారు చేసిన వాటిలో వండితే ఏమీ కాదని భావించి.. వాటిలో వంటలు చేస్తున్నారు. చేసిన వంటల్ని కూడా గాజుపాత్రల్లోనే నిల్వ చేస్తున్నారు. గాజు పాత్రల్లో ఉంచిన, వండిన ఆహారాలను తినడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.

గాజు పాత్రల్లో వంట చేస్తే.. వండే ఆహార పదార్థాల్లో ఉండే ఆమ్లతత్వం కారణంగా.. రసాయనిక చర్యలు జరిగి గాజులో ఉండే పదార్థాలు వంటల్లో కలిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గాజు పాత్రల తయారీలో లెడ్, కోబాల్ట్, కాడ్మియం వంటి వాటిని వాడుతుంటారు. వంట చేసేటపుడు గాజు పాత్రల్లో ఉండే ఈ కారకాలు కరిగి ఆహారంలో కలవడం వల్ల.. త్వరగా జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కోబాల్ట్, లెడ్ మూలకాలు క్యాన్సర్ ను ప్రేరేపిస్తాయి.

తరచూ గాజుపాత్రల్లో వండిన ఆహారాలను తింటే.. డీఎన్ఏలో మార్పులు జరిగి.. క్యాన్సర్ కణాలు పెరిగి.. క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని .. సంతానలేమికి కారణం కావొచ్చని హెచ్చరించారు. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ పెరిగి బలహీనంగా తయారవుతారని, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయని పేర్కొన్నారు. గాజుతో పాటు.. అల్యూమినియం పాత్రల్లో వండిన వంటలను కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. అన్నింటికంటే మట్టిపాత్రల్లో వండిన ఆహారాలను తినడం ఆరోగ్యకరమని సూచిస్తున్నారు. ఇకనైనా మీరు వంటచేసే పాత్రలను మార్చి.. ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి