Make milkmaid at Home: ఇంట్లోనే మిల్క్ మెయిడ్ ను తయారు చేసుకోండిలా!!

మిల్క్ మెయిడ్.. దీనినే కండెన్స్ డ్ మిల్క్ అని కూడా అంటాం. మిల్క్ మెయిడ్ ను వివిధ రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటాం. కేక్స్, పుడ్డింగ్స్ వంటి ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా బయట దొరికే మిల్క్ మెయిడ్ నే వాడుతుంటారు. బయట లభించే మిల్క్ మెయిడ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఇతర రసాయనాలను కలుపుతారు. అలాంటివి వాడటం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి ఇంట్లోనే మిల్క్ మెయిడ్ ను తయారు చేసుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుందని..

Make milkmaid at Home: ఇంట్లోనే మిల్క్ మెయిడ్ ను తయారు చేసుకోండిలా!!
Milkmaid
Follow us
Chinni Enni

|

Updated on: Aug 19, 2023 | 7:15 PM

మిల్క్ మెయిడ్.. దీనినే కండెన్స్ డ్ మిల్క్ అని కూడా అంటాం. మిల్క్ మెయిడ్ ను వివిధ రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటాం. కేక్స్, పుడ్డింగ్స్ వంటి ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా బయట దొరికే మిల్క్ మెయిడ్ నే వాడుతుంటారు. బయట లభించే మిల్క్ మెయిడ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఇతర రసాయనాలను కలుపుతారు. అలాంటివి వాడటం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి ఇంట్లోనే మిల్క్ మెయిడ్ ను తయారు చేసుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటారు. కానీ ఇంట్లోనే మిల్క్ మెయిడ్ ను చాలా ఈజీగా తయారు చేసుకుని, వాడుకోవచ్చు. దీని టేస్ట్ కూడా బయట దొరికే వాటిలాగే ఉంటుంది. మరి ఇంట్లోనే మిల్క్ మెయిడ్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

మిల్క్ మెయిడ్ తయారీకి కావలసిన పదార్థాలు:

చిక్కటి పాలు – 1/2 లీటర్ పంచదార – 1 కప్పు (150 గ్రా) బేకింగ్ పౌడర్ – 1/4 టీ స్పూన్

ఇవి కూడా చదవండి

మిల్క్ మెయిడ్ తయారీ విధానం:

ఒక కళాయిని నీటితో కడిగి అందులో పాలు పోయాలి. పాలను మధ్యస్థ మంటపై మీగడ కట్టకుండా గరిటెతో తిప్పుతూ పొంగువచ్చే వరకూ మరిగించాలి. పాలు మరిగిన తర్వాత పంచదార వేసి కలుపుతూ ఉండాలి. అరలీటర్ పాలల్లో పావు వంతి మిగిలేంత వరకూ మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి 2 నిమిషాలపాటు ఉండలు లేకుండా కలపాలి.

ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత చూస్తే.. బయట మనకు దొరికే మిల్క్ మెయిడ్ మాదిరిగా తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో ఉంచి.. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న మిల్క్ మెయిడ్ 6 నెలల వరకూ తాజాగా ఉంటుంది. దీనితో కేక్, ఇతర స్వీట్లు, పుడ్డింగ్స్ తయారు చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి