Hair Fall Tips: జుట్టు బాగా రాలిపోతుందా ? ఈ చిట్కాలను పాటించండి

జుట్టు రాలడం (hair fall).. ఈ రోజుల్లో దాదాపు అందరినీ వేధిస్తున్న సమస్య. ఎంత ఒత్తైన జుట్టున్న వారైనా సరే.. కెమికల్స్ తో చేసిన షాంపూలు, ఆయిల్స్, వాయుకాలుష్యం కారణంగా ఎక్కువగా జుట్టు రాలిపోయి.. ఆఖరికి యుక్త వయసులోనే బట్టతల వచ్చేస్తోంది. ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే.. జుట్టురాలే సమస్య నుంచి బయటపడొచ్చు. కలబంద గుజ్జును తలలో కుదుళ్లకు బాగా పట్టించి.. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండుసార్లైనా ఇలా చేస్తే జుట్టు రాలడం..

Hair Fall Tips: జుట్టు బాగా రాలిపోతుందా ? ఈ చిట్కాలను పాటించండి
Hair Fall
Follow us
Chinni Enni

|

Updated on: Aug 19, 2023 | 6:27 PM

జుట్టు రాలడం (hair fall).. ఈ రోజుల్లో దాదాపు అందరినీ వేధిస్తున్న సమస్య. ఎంత ఒత్తైన జుట్టున్న వారైనా సరే.. కెమికల్స్ తో చేసిన షాంపూలు, ఆయిల్స్, వాయుకాలుష్యం కారణంగా ఎక్కువగా జుట్టు రాలిపోయి.. ఆఖరికి యుక్త వయసులోనే బట్టతల వచ్చేస్తోంది. ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే.. జుట్టురాలే సమస్య నుంచి బయటపడొచ్చు.

కలబంద: కలబంద గుజ్జును తలలో కుదుళ్లకు బాగా పట్టించి.. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండుసార్లైనా ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

పచ్చి కొబ్బరి: పచ్చికొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వాటిని పేస్ట్ చేసి.. దానిని ఒక కాటన్ క్లాత్ లో వేసి.. పాలను పిండాలి. వీటిని తలకు రాసి.. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలంటుకుంటే.. హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వేపాకు: గిన్నెలో 2 గ్లాసుల నీరు పోసి.. అందులో గుప్పెడు వేపాకు వేసి.. ఒక గ్లాసు నీరు అయ్యేంత వరకూ మరిగించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి.. తలస్నానం చేయాలి. జుట్టురాలడం తగ్గడంతో పాటు.. చుండ్రు, దురద కూడా తగ్గుతాయి.

పెరుగు: 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ నుంచి రసం తీసి.. వాటన్నింటినీ బాగా కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే.. హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడొచ్చు.

మెంతులు: 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే ఆ మెంతులను తీసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లో 4 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి, ఒక గుడ్డు తెలసొనను కలిపి.. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలంటుకోవాలి. ఇలా వారానికి కనీసం 2 సార్లైనా చేస్తే.. జుట్టు ఒత్తుగా, మెత్తగా పెరుగుతుంది.

ఉసిరికాయలు: పచ్చి ఉసిరికాయల్లో గింజలను తీసేసి.. పేస్ట్ చేసి రసం తీసుకోవాలి. అందులో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

కొత్తిమీర: కొత్తిమీరను సన్నగా తరిగి.. మిక్సీలో వేసి అందులో కొద్దిగా నీరు పోసి జ్యూస్ గా చేసుకోవాలి. దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివళ్ల వరకూ పట్టించి.. కొద్దిసేపటి తర్వాత హెడ్ బాత్ చేస్తే.. వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి