Cashews Precautions: జీడి పప్పు ప్రతిరోజూ తినడం మంచిదేనా? కాదా?
డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అనగానే మనకు గుర్తొచ్చే వాటిలో జీడి పప్పు కూడా ఒకటి. కానీ జీడిపప్పును రోజూ తింటే బరువు పెరుగుతారని, శరీరంలో కొవ్వు పెరుగుతుందని దీనిని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపరు. జీడి పప్పంటే ఇష్టం ఉన్నవారు కూడా.. డైట్ కారణంగా దానిని దూరంగా ఉంచుతారు. నిజంగానే జీడి పప్పును రోజూ తినకూడదా ? దానివల్ల అనర్థాలే తప్ప ఆరోగ్య ప్రయోజనాలు లేవా? అంటే.. ఉన్నాయి. రోజూ జీడిపప్పును సరైన మోతాదులో తింటే.. అనారోగ్యం ఉండదు. మరి ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటాం..
డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అనగానే మనకు గుర్తొచ్చే వాటిలో జీడి పప్పు కూడా ఒకటి. కానీ జీడిపప్పును రోజూ తింటే బరువు పెరుగుతారని, శరీరంలో కొవ్వు పెరుగుతుందని దీనిని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపరు. జీడి పప్పంటే ఇష్టం ఉన్నవారు కూడా.. డైట్ కారణంగా దానిని దూరంగా ఉంచుతారు. నిజంగానే జీడి పప్పును రోజూ తినకూడదా ? దానివల్ల అనర్థాలే తప్ప ఆరోగ్య ప్రయోజనాలు లేవా? అంటే.. ఉన్నాయి. రోజూ జీడిపప్పును సరైన మోతాదులో తింటే.. అనారోగ్యం ఉండదు. మరి ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటాం ? జీడిపప్పులో ఏమేం పోషకాలుంటాయో చూద్దాం.
జీడిపప్పును సూపర్ హెల్దీ ఫుడ్ గా పిలుస్తారు. 30 గ్రాముల జీడిపప్పులో 155 క్యాలరీల శక్తి లభిస్తుంది. 9.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5.1 గ్రాముల ప్రొటీన్లు, సూక్ష్మ మోతాదులో విటమిన్ E, B6, విటమిన్ K10, క్యాల్షియం లభిస్తాయి. అలాగే జింక్, మెగ్నీషియం, కాపర్, పాస్ఫరస్, ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో శరీరానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. విటమిన్లు A,D,E,Kలు ఆ కొవ్వుల్లో కరిగి.. అవి మన శరీరానికి అందుతాయి. వీటిలో ఉండే పాలీ అన్ శాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండెజబ్బులు రాకుండా కాపాడుతాయి.
కంటి ఆరోగ్యం: కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే.. క్యారెట్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలన్న విషయం తెలిసిందే. కళ్లపై భారం పడి కంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ జీడిపప్పును తగిన మోతాదులో తినాలి. వీటిలో ఉండే జియా జాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటిరెటీనాపై సురక్షితమైన పొరను ఏర్పరచి కళ్లను రక్షిస్తాయి. అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం కూడా కళ్లపై పడకుండా ఉంటుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం: శరీరంలో ఐరన్, విటమిన్ డి లోపం కారణంగా రక్తహీనత వస్తుంది. దీంతో కాపర్ కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ జీడిపప్పు తింటే.. అందులో ఉండే కాపర్.. రక్తహీనత రాకుండా.. రక్తసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అలాగే చర్మం, వెంట్రుకల్లో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ ను ఉత్పత్తి చేసి.. జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది.
బరువు తగ్గుతుంది: జీడిపప్పు రోజూ తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ నిజానికి జీడిపప్పును తింటే బరువు తగ్గుతారని రీసెర్చర్లు చెబుతున్నారు. ఇది వృక్షసంబంధమైన పదార్థం కాబట్టి.. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులే ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెటబాలిజాన్ని పెంచుతాయి. జీడిపప్పును నేరుగా తింటేనే ఈ ఫలితం ఉంటుంది. నేతిలో వేయించి, ఉప్పుకారం చల్లుకుని తింటే ఫలితం ఉండదు.
కాగా జీడిపప్పు నుంచి తీసే నూనె స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఈ నూనెలో జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి