Control Blood Pressure: ఈ ఆహారాలను తింటే.. హై బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు!!
అధిక రక్తపోటు.. దీనిని ఆంగ్లంలో హై బీపీ అని పిలుస్తాం. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే బీపీ, షుగర్ లు కంట్రోల్ లో ఉండాలి. అవి ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే. ముఖ్యంగా బీపీ పెరిగితే.. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బీపీ ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. గుండె పోటుకు గురయ్యే అవకాశాలు కూడా అధికమే. కాబట్టి బీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఆల్రెడీ మీకు అధిక రక్తపోటు ఉన్నా.. ఈ ఆహారాలను తీసుకుంటే..
అధిక రక్తపోటు.. దీనిని ఆంగ్లంలో హై బీపీ అని పిలుస్తాం. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే బీపీ, షుగర్ లు కంట్రోల్ లో ఉండాలి. అవి ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే. ముఖ్యంగా బీపీ పెరిగితే.. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బీపీ ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. గుండె పోటుకు గురయ్యే అవకాశాలు కూడా అధికమే. కాబట్టి బీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఆల్రెడీ మీకు అధిక రక్తపోటు ఉన్నా.. ఈ ఆహారాలను తీసుకుంటే.. బీపీ కంట్రోల్ అవుతుంది.
అధిక రక్తపోటును తగ్గించే ఆహారాలు:
వెల్లుల్లి: వెల్లుల్లి గురించి మనం గతంలో చాలా రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. బీపీని నియంత్రించడంలో కూడా వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే 2 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసేసి.. నమిలి తినాలి. అలా తినలేనివారు తేనెతో కలుపుకుని తినొచ్చు.
నిమ్మకాయ: నిమ్మకాయతో కూడా బీపీని కంట్రోల్ చేయొచ్చు. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ గుండెకు వెళ్లే రక్తనాళాలను మృదువుగా ఉండేలా చేస్తాయి. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో.. అరచెక్క నిమ్మరసం పిండుకుని.. పరగడుపునే తాగితే.. క్రమంగా బీపీ అదుపులోకి వస్తుంది.
గ్రీన్ వెజిటేబుల్స్: ఆకుపచ్చని కూరగాయలను అధికంగా తీసుకుంటే.. హైబీపీని నియంత్రించవచ్చు. పీచుపదార్థం, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం గ్రీన్ వెజిటబుల్స్ లో ఎక్కువగా ఉంటాయి. రోజూ వీటిని తింటే హైబీపీ తగ్గుతుంది. ముఖ్యంగా బీన్స్ ను తరచూ ఆహారంలో తీసుకుంటే.. హైబీపీ నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు.
బనానా: అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. హైబీపీ ఉన్నవారు అరటి పండును తింటే.. వెంటనే బీపీ అదుపులోకి వస్తుంది. రోజూ అరటిపండు తింటే క్రమంగా బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి