కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి చాలా ముఖ్యం. అయినప్పటికీ, చాలా సార్లు చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి, కొన్ని రకాల వ్యాధులు, అలాంటి వ్యాధులకు వాడే మందులు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అటువంటి స్థితిలో, మూత్రపిండాలు క్రమంగా ప్రభావితమవుతాయి. అయితే, మూత్రపిండాలు పూర్తిగా క్షీణించకముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని విస్మరించకూడదు. మూత్రపిండాల వ్యాధికి సంబంధించి ఇటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి రాత్రిపూట ఎక్కువగా తెలుస్తుంటాయి.