Home Tips for Thighs Burning: తొడలు రాసుకుపోయి ఎర్రగా, నల్లగా అవుతున్నాయా ? ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరి!!

కొందరికి రెండు తొడలు దగ్గరగా ఉంటాయి. అధిక బరువు వల్ల కూడా ఇలా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఎక్కువ దూరం నడిచినా.. అధికంగా చెమట పట్టిన రెండు తొడలు రాసుకుపోయి ఎరుపెక్కి మంట వస్తుంది. కొందరికి తొడలు రాసుకోవడం వల్ల నల్లగా కూడా ఉంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కలబంద చర్మ సంరక్షణలో బాగా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలను తగ్గించడమే కాదు.. చర్మంపై గాయాలు, పుండ్లను కూడా త్వరగా మానేలా చేస్తుంది. కలబంద గుజ్జును కందిన తొడలపై రాస్తూ ఉంటే..

Home Tips for Thighs Burning: తొడలు రాసుకుపోయి ఎర్రగా, నల్లగా అవుతున్నాయా ? ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరి!!
Home Tips For Thight Burning
Follow us

|

Updated on: Aug 20, 2023 | 6:39 PM

కొందరికి రెండు తొడలు దగ్గరగా ఉంటాయి. అధిక బరువు వల్ల కూడా ఇలా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఎక్కువ దూరం నడిచినా.. అధికంగా చెమట పట్టిన రెండు తొడలు రాసుకుపోయి ఎరుపెక్కి మంట వస్తుంది. కొందరికి తొడలు రాసుకోవడం వల్ల నల్లగా కూడా ఉంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

కలబంద: కలబంద చర్మ సంరక్షణలో బాగా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలను తగ్గించడమే కాదు.. చర్మంపై గాయాలు, పుండ్లను కూడా త్వరగా మానేలా చేస్తుంది. కలబంద గుజ్జును కందిన తొడలపై రాస్తూ ఉంటే.. ఉపశమనం ఉంటుంది. నలుపు కూడా తగ్గుతుంది.

కొబ్బరి నూనె: కొబ్బరినూనెలో చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉంటాయి. ఇది వాపుల్ని తగ్గిస్తుంది. తొడలు రాసుకుని ఒరిసిన ప్రాంతంలో కొబ్బరి నూనె రాస్తే.. దాని నుంచి వెంటనే రిలీఫ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మొక్కజొన్న పిండి: మొక్కజొన్న పిండిని.. తొడలు కందిన చోట పౌడర్ చల్లినట్లు చల్లితే.. ఎక్కువగా చెమట పట్టకుండా ఉంటుంది. దీనివల్ల పదే పదే తొడలు కందిపోకుండా ఉంటాయి.

ఐస్ క్యూబ్స్ : ఐస్ క్యూబ్స్ ను పలుచటి వస్త్రంలో చుట్టి.. దానితో మంట ఉన్న చోట మర్దనా చేస్తున్నట్లు రాస్తే.. 5 నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు.

బేకింగ్ సోడా: 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు, 5 చుక్కల లవంగం నూనెను తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తొడలు రాసుకునే చోట అప్లై చేసి.. 5 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగేయాలి. దీనివల్ల మంట, దురద, నలుపు తగ్గుతాయి.

ఆలివ్ ఆయిల్: కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని తొడలు రాసుకునే చోట అప్లై చేయాలి. తరచూ ఇలా ఆలివ్ ఆయిల్ రాస్తూ ఉంటే.. తొడలు ఎరుపెక్కకుండా, మంటలేకుండా ఉంటాయి.

కాగా శరీరంలో అధిక వేడి ఉన్నా.. తొడల వద్ద మంట వస్తుంటుంది. మజ్జిగ, నిమ్మరసం, సబ్జా నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే శరీరంలో వేడి తగ్గి మంట తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్యాషన్ పేరుతో శరీరాన్ని చూపించడం అస్సలు నచ్చదు..
ఫ్యాషన్ పేరుతో శరీరాన్ని చూపించడం అస్సలు నచ్చదు..
ఎలక్ట్రిక్‌ ప్రెష‌ర్ కుక్కర్‌లో వండినఅన్నం తింటే ఏమవుతుందో తెలుసా
ఎలక్ట్రిక్‌ ప్రెష‌ర్ కుక్కర్‌లో వండినఅన్నం తింటే ఏమవుతుందో తెలుసా
రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే..
రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే..
కడుపు మసాజ్‌తో చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?
కడుపు మసాజ్‌తో చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?
మీరు కారు కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ఈ 7 కార్లపై భారీ తగ్గింపు
మీరు కారు కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ఈ 7 కార్లపై భారీ తగ్గింపు
వావ్..రోటీతో మ్యాగీ.. ఇలా కూడా తయారు చేయవచ్చా..!
వావ్..రోటీతో మ్యాగీ.. ఇలా కూడా తయారు చేయవచ్చా..!
అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం
అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం
యాడ్‌పై క్లిక్‌ చేస్తే రూ. 1.16కోట్లు లాగేశారు.. జాగ్రత్త భయ్యా!
యాడ్‌పై క్లిక్‌ చేస్తే రూ. 1.16కోట్లు లాగేశారు.. జాగ్రత్త భయ్యా!
డైట్‌ సోడాలతో ఆరోగ్యానికి ముప్పు.. నిపుణులు చెబుతున్న షాకింగ్‌
డైట్‌ సోడాలతో ఆరోగ్యానికి ముప్పు.. నిపుణులు చెబుతున్న షాకింగ్‌
ఒక్కొక్కరికి రూ.లక్ష 90 వేలు.. చెక్కులు పంపిణీ చేసిన భట్టి
ఒక్కొక్కరికి రూ.లక్ష 90 వేలు.. చెక్కులు పంపిణీ చేసిన భట్టి