AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: శృంగార సమస్యలతో పాటు చర్మ సౌందర్యానికి ఉపయోగపడే జాజికాయ!!

సుగంధ ద్రవ్యాల్లో ఒకటి జాపత్రి. దీన్నే జాజికాయ అని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువగా బిర్యానీల్లో, మసాలాల్లో, సూప్స్, సలాడ్స్ లలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పాలలో జాజికాయ పొడిని కాస్త కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. కానీ దీని వలన ప్రయోజనాలు మాత్రం అద్భుతం అని చెప్పవచ్చు. కొన్ని వందల సంవత్సరాలుగా దీన్ని వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. కేవలం వంటకాల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా జాపత్రిని విరివిగా యూజ్ చేస్తారు. దీనిలో ఔషధ గుణాలు..

Kitchen Hacks: శృంగార సమస్యలతో పాటు చర్మ సౌందర్యానికి ఉపయోగపడే జాజికాయ!!
Nutmeg Benefits
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 20, 2023 | 7:39 PM

Share

సుగంధ ద్రవ్యాల్లో ఒకటి జాపత్రి. దీన్నే జాజికాయ అని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువగా బిర్యానీల్లో, మసాలాల్లో, సూప్స్, సలాడ్స్ లలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పాలలో జాజికాయ పొడిని కాస్త కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. కానీ దీని వలన ప్రయోజనాలు మాత్రం అద్భుతం అని చెప్పవచ్చు. కొన్ని వందల సంవత్సరాలుగా దీన్ని వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. కేవలం వంటకాల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా జాపత్రిని విరివిగా యూజ్ చేస్తారు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెంచడానికి ఉపయోగిస్తూంటారు. జాజికాయలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత: జాపత్రికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ కాయ నుంచి తీసిన నూనె మెస్ ఆయిల్ అంటారు. ఆయుర్వేదంలో, అరోమా థెరపీలో ఈ నూనెను ఎక్కువగా చేస్తూంటారు.

సెక్స్ సమస్యలు: సెక్స్ సామర్థ్యం తగ్గి సంతానలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి ఓ గ్లాస్ గోరు వెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుసుకుని తాగితే నరాల బలహీనత, లైంగిక సామర్థ్యం, వీర్య కణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సీజనల్ వ్యాధులకు చెక్: రాత్రి పడుకునే ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో పసుపు, జాపత్రి పొడిని కొంచెం కలుపుకుని తాగితే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. జ్వరం, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండొచ్చు.

జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది: జాజికాయ.. జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా చేస్తుంది. మల బద్ధకం, గ్యాస్, ఎసిడిటి సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.

చర్మం సౌందర్యం: జాజికాయ నూనెను స్నానం చేసేటప్పుడు నీటిలో వేసుకుని చేస్తే.. ఇందులో లభించే నయనైడిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మ ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది.

రక్త ప్రసరణ: జాపత్రిలో ఉన్న ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చేస్తుంది. రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి