Blood Donation Tips: మీరు రక్తదానం చేస్తున్నారా.. అయితే ఈ తప్పక విషయాలు గుర్తు పెట్టుకోండి!!
మన దేశంలో ప్రతిఏటా 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతుండగా.. రక్తదాతల నుంచి లభిస్తున్నది కేవలం 5 లక్షల యూనిట్లేనని నివేదికలు చెబుతున్నాయి. రక్తం కొరత కారణంగా.. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ అనేకమంది కన్ను మూస్తున్నారు. ఇది తగ్గాలంటే.. రక్తదాతల సంఖ్య పెరగాలి. ప్రమాదాలు, డెలివరీలు, శస్త్రచికిత్సలతో పాటు.. తలసేమియా, లుకేమియా, సికిల్ సెల్ ఎనీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయాలంటే.. రక్తం చాలా అవసరం. దీనిని తయారుచేసే టెక్నాలజీ
రక్తదానం.. ఒక వ్యక్తి ఒకసారి రక్తదానం చేస్తే నలుగురి ప్రాణాలను కాపాడవచ్చు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా వెల్లడించింది. రక్తంనుంచి ప్లాస్మా, ఎర్ర రక్ తకణాలు, తెల్ల రక్తకణాలను వేరుచేసి.. పలువురి ప్రాణాలను కాపాడవచ్చు. ఒకప్పుడు రక్తదానం చేయాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు జరుగుతుండటంతో.. ప్రజలే స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే రక్తదానం చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
మన దేశంలో ప్రతిఏటా 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతుండగా.. రక్తదాతల నుంచి లభిస్తున్నది కేవలం 5 లక్షల యూనిట్లేనని నివేదికలు చెబుతున్నాయి. రక్తం కొరత కారణంగా.. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ అనేకమంది కన్ను మూస్తున్నారు. ఇది తగ్గాలంటే.. రక్తదాతల సంఖ్య పెరగాలి. ప్రమాదాలు, డెలివరీలు, శస్త్రచికిత్సలతో పాటు.. తలసేమియా, లుకేమియా, సికిల్ సెల్ ఎనీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయాలంటే.. రక్తం చాలా అవసరం. దీనిని తయారుచేసే టెక్నాలజీ ఇంకా రాలేదు. కేవలం మనుషులు దానం చేస్తేనే మరో ప్రాణం నిలబడుతుంది. అందుకే రక్తదాతల్ని.. ప్రాణదాతలంటారు.
రక్తదానం చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఐరన్ ఫుడ్ తీసుకోవాలి: రక్తదానం చేసేముందు ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో రక్తం ఉత్పత్తి పెరుగుతుంది. రక్తదానం చేసేటపుడు ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి అనీమియా (రక్తహీనత) సమస్య రాకుండా ఉంటుంది.
విటమిన్ సి: విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇది మనం తినే ఆహారం నుంచి ఐరన్ ను త్వరగా గ్రహించడంలో సహాయపడుతుంది.
నీరు తీసుకోవాలి: రక్తదానం చేసేముందు, చేసిన తర్వాత కనీసం అరలీటరు మంచినీళ్లైనా తాగాలి. రక్తదానం చేసిన రోజున రెండున్నర లీటర్ల నీళ్లైనా తాగేలా చూసుకోవాలి.
బాగా నిద్రపోవాలి: రక్తదానం చేసేముందు రోజున బాగా నిద్రపోవాలి. శరీరానికి తగిన నిద్ర ఉంటే.. హృదయస్పందన బాగుంటుంది.
రక్తపోటు: రక్తపోటు ఎక్కువగా ఉంటే.. మీరు రక్తదానం చేయకూడదు. అందుకే రక్తదానం చేసేముందు మిమ్మల్ని పరీక్షిస్తారు.
కొవ్వు ఉన్న ఆహారాలను తీసుకోకూడదు: కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. అలా చేస్తే.. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి.. మీ రక్త నమూనాలను పరీక్షించడం కష్టమవుతుంది.
ఆల్కహాల్ కి తీసుకోకూడదు: రక్తదానం చేసే ముందు గానీ.. ఆ ముందురోజు గానీ ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇది డీ హైడ్రేషన్ కు కారణమవుతుంది. రక్తదానం చేసిన 3 రోజులవరకూ కూడా మద్యం తీసుకోకూడదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి