India’s Oldest Elephant Dies: భారతదేశంలోని అత్యంత వృద్ధ ఏనుగు మృతి.. అనారోగ్యంతో మరణించిన బిజులీ ప్రసాద్ వయసెంతో తెలుసా..?

సాధారణంగా ఏనుగులు అడవిలో 65 సంవత్సరాల వరకు జీవించగలవు. అదే ఏనుగులు జంతుప్రదర్శనశాలలలో 80 సంవత్సరాల వరకు జీవించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే అస్సాంలోని టీ తోటలో పెరిగిన గజరాజు 89 ఏళ్లు జీవించింది. ఏనుగుల మరణానికి ప్రధాన కారణం దంతాలు కోల్పోవడం. దంతాలు లేకుంటే ఏనుగులు తినలేక ఆకలితో చనిపోతాయి. అలా అస్సాంలోని ఏనుగులకు అక్కడి మావటీలు వండిన ఆహారాన్ని తినిపించేవారు.

India's Oldest Elephant Dies: భారతదేశంలోని అత్యంత వృద్ధ ఏనుగు మృతి.. అనారోగ్యంతో మరణించిన బిజులీ ప్రసాద్ వయసెంతో తెలుసా..?
India's Oldest Elephant Die
Follow us

|

Updated on: Aug 21, 2023 | 6:54 PM

భారతదేశంలోనే అతి పెద్ద మగ ఏనుగు బిజులీ ప్రసాద్ మృతి చెందింది. ఈ ఏనుగు వయసు 89 ఏళ్లు. అస్సాంలోని తేయాకు తోటల్లో ఈ ఏనుగు రాజులా జీవించింది. ఈ ఆసియాటిక్ ఏనుగు దాని సుదీర్ఘ జీవితకాలం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అస్సాంలోని బెహాలి టీ ఎస్టేట్‌లో ఈ ఏనుగు తుది శ్వాస విడిచింది. ది విలియమ్సన్ మాగోర్ గ్రూప్‌కు చెందిన తేయాకు తోటలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఏనుగు తుది శ్వాస విడిచింది. ఏనుగు చనిపోవడానికి వయసు సంబంధిత అనారోగ్య సమస్యలే కారణమని నిపుణులు తెలిపారు.

ఇంగ్లండ్‌కు చెందిన ఆలివర్ సాహిబ్ ఈ ఏనుగుకు మొదటి మాస్టర్. ఈ ఏనుగుకు బిజులీ ప్రసాద్ అని పేరు పెట్టాడు. ఈ ఏనుగును చూసేందుకు జంతు ప్రేమికులు ఎగబడ్డారు. తేయాకు తోటల కార్మికులు, స్థానిక ప్రజలు ఏనుగుకు ఆహారం ఇవ్వడంతో పాటు దాని ఆరోగ్య సంరక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు సలాగ్ మరణంతో అందరూ బాధపడ్డారు.

ఈ ఏనుగు పిల్లగా ఉన్నప్పుడు బెర్గాంగ్ టీ ఎస్టేట్‌లో ఉండేది. అక్కడి నుంచి ఏనుగు పిల్లను విలియమ్సన్ మగర్ గ్రూప్ టీ ఎస్టేట్‌కు తీసుకొచ్చారు. బెర్గాంగ్ టీ ఎస్టేట్ విక్రయించబడినందున, ఏనుగుకు మరొక టీ ఎస్టేట్‌లో వసతి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏనుగు మన ప్రతిష్టకు ప్రతీక అని తేయాకు తోటల అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రఖ్యాత ఏనుగు శస్త్రవైద్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ డా. బిజులీ ప్రసాద్ సలాగ్ మృతి పట్ల కుశాల్ కొన్వర్ శర్మ సంతాపం వ్యక్తం చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో పెంపుడు జంతువుగా అత్యధిక కాలం జీవించిన ఏనుగు రికార్డు బిజులీ ప్రసాద్ పేరిట ఉందన్నారు. ఆసియా ఏనుగులు సాధారణంగా అడవిలో 62 నుండి 65 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇదే ఏనుగులను జంతుప్రదర్శనశాలల్లో లేదా ప్రైవేట్‌గా పెంపుడు జంతువులుగా ఉంచినట్లయితే 80 సంవత్సరాల వరకు జీవించగలవు. అయితే ఏనుగుకు అద్భుతమైన సంరక్షణ లభించడం వల్లే 89 ఏళ్లు బతికిందని అతను చెబుతున్నారు.

8 నుంచి 10 ఏళ్ల క్రితం బిజులీ ప్రసాద్ ఏనుగు దంతాలు రాలిపోయాయి. దాంతో ఈ ఏనుగు ఏమీ తినలేకపోయింది. అడవిలోని ఏనుగులు దంతాలు కోల్పోవడం, ఆహారం లేకపోవడం వల్ల తరచుగా ఆకలితో చనిపోతాయి. బిజులీ ప్రసాద్ ఏనుగు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అందుకే ఏనుగుకు మామూలుగా ఇచ్చే ఆహారాన్ని మార్చేసినట్టుగా డాక్టర్‌ చెప్పారు. ఈ ఏనుగుకు వండిన అన్నం, సోయాబీన్స్, అధిక ప్రొటీన్లు మాత్రమే తినిపించినట్లు డా. శర్మ, బిజులీ ప్రసాద్ తెలిపారు. ఈ కారణంగానే బిజులీ ప్రసాద్ జీవితకాలం మరింత పెరిగిందని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..