Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముస్లిం ఫంక్షన్‌ అంటే రొయ్య వంటకం ఉండాల్సిందే.. తినొద్దంటూ ఫత్వా జారీ చేసిన డీమ్డ్‌ వర్సిటీ.. అయోమయంలో ప్రజలు..

Hyderabad: అసలు రొయ్యల వాడకంపై వర్సిటీ ఫత్వా వెనుక కారణమేంటి? ఎందుకు నిషేధించింది? అవును, ఈ ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పాతబస్తీకి చెందిన ఓ ఇస్లామిక్ సంస్థ ముస్లింలకు రొయ్యల వినియోగంపై అనుమతి నిరాకరిచండం చర్చనీయాంశంగా మారింది. రొయ్యలు అనేవి చేపజాతికి చెందినవి కాదంటోంది ఆ సంస్థ. శతాబ్దంన్నర చరిత్ర కలిగిన ఇస్లామిక్‌ సంస్థ సైతం ముస్లింలు రొయ్యలు తినడం సరికాదంటూ ఫత్వా జారీచేయడంపై భిన్నాభిప్రాయాలు..

ముస్లిం ఫంక్షన్‌ అంటే రొయ్య వంటకం ఉండాల్సిందే.. తినొద్దంటూ ఫత్వా జారీ చేసిన డీమ్డ్‌ వర్సిటీ.. అయోమయంలో ప్రజలు..
Representative Image
Follow us
Noor Mohammed Shaik

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 22, 2023 | 5:48 AM

హైదరాబాద్, ఆగస్టు 22: దేశవ్యాప్తంగా ముస్లింలు రొయ్యలు తినడంపై ఇస్లామిక్‌ డీమ్డ్‌ వర్సిటీ నిషేధం విధిస్తూ ఫత్వా జారీచేయడం వివాదంగా మారింది. రొయ్యలు తినడం ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధమని ప్రకటించడంపై చేపల ప్రియులు అసహనం ప్రదర్శిస్తున్నారు. అసలు రొయ్యల వాడకంపై వర్సిటీ ఫత్వా వెనుక కారణమేంటి? ఎందుకు నిషేధించింది? అవును, ఈ ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పాతబస్తీకి చెందిన ఓ ఇస్లామిక్ సంస్థ ముస్లింలకు రొయ్యల వినియోగంపై అనుమతి నిరాకరిచండం చర్చనీయాంశంగా మారింది. రొయ్యలు అనేవి చేపజాతికి చెందినవి కాదంటోంది ఆ సంస్థ. శతాబ్దంన్నర చరిత్ర కలిగిన ఇస్లామిక్‌ సంస్థ సైతం ముస్లింలు రొయ్యలు తినడం సరికాదంటూ ఫత్వా జారీచేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రొయ్యలే కాదు, పీతలు కూడా తినడానికి అనర్హమైనవి అంటూ ఫత్వా చెబుతోంది.

అయితే ఈ ఫత్వా పై చేపప్రియులు మాత్రం అసహనం వ్యక్తంచేస్తున్నారు. వందలాది ముస్లిం పండితులు సైతం విభేదిస్తున్నారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం ఆహారంలో మూడు వర్గాలు ఉన్నాయి. వాటిని హలాల్, హరామ్, మక్రుహ్‌గా వర్గీకరించారు. వీటిలో హలాల్‌ మాత్రమే ముస్లింలను అనుమతిస్తోంది. ఇక హరామ్‌ను నిషేధిత జాబితాలో చేర్చగా.. మక్రుహ్‌ను ఏకంగా అసహ్యమైనదిగా చిత్రీకరిస్తోంది. ఇందుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణపై భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రొయ్య ఒక కీటక జాతికి చెందిందని.. అది చేపవర్గం కాదన్నది ఇస్లామిక్‌ సంస్థ వాదన. అందుకే వాటి వినియోగంపై ఫత్వా జారీచేసినట్లు వర్సిటీ పెద్దలు చెబుతున్నారు. మక్రుహ్ అసహ్యించుకునేదే అయినా తినవచ్చని చెప్పడంపై చేప ప్రియులతోపాటు మతపెద్దలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఒకప్పుడు రొయ్యలను మక్రూహ్‌గా భావించిన దార్-ఉల్-ఉలూమ్.. ఇప్పుడు హలాల్‌గా ప్రకటించడంతో ముస్లింలు రొయ్యలను ఇష్టంతో తింటున్నారు.

ఇవి కూడా చదవండి

ముస్లిం ఇళ్లల్లో ఫంక్షన్‌ ఏదైనా రొయ్యవంటకం లేకుండా ఉండదు. అంతలా వారితో మమేకమైంది ఆ వంట. అంత ఇష్టంగా తినే రొయ్యలు చేప జాతికి చెందినవి కావంటూ ఇస్లామిక్‌ వర్సిటీ తేల్చడం.. వెంటనే ఫత్వా జారీచేయడం వివాదాస్పదంగా మారింది. ఫత్వాను విడుదల చేసిన ఇస్లామిక్‌ సంస్థను దేశవ్యాప్తంగా ముస్లింలు ఎంతో అభిమానిస్తారు. రొయ్యల వినియోగాన్ని నిషేధిస్తూ ఆ సంస్థ జారీచేసిన ఫత్వాను గౌరవిస్తారు. ఇదే సమయంలో ఇంకొందరు విభేదించడమే హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నో రీసెర్చ్‌ల తర్వాతే వర్సిటీ ఫత్వా రిలీజ్‌ చేసినట్లు చెబుతున్నారు కొందరు. మొత్తంగా రొయ్యల వినియోగంపై ఫత్వా పెనుదుమారం రేపిందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో రొయ్యను తినాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు ముస్లింలు.