Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రాజకీయాల వైపు చూస్తున్న పాతబస్తీ రౌడీలు.. పార్టీ టికెట్ల కోసం ఆరాటం

ఎప్పుడూ కొట్టుకోవడం.. చంపుకోవడమేనా.. బోరు కొడుతోంది గురూ అంటున్నారు రౌడీషీటర్లు. మనమూ రాజకీయాల్లోకి వచ్చి ఆ దర్జాను అనుభవిద్దామంటున్నారు. ఇంతకు ఆ రౌడీషీటర్లు ఎవరు? రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. వాస్తవానికి పాతబస్తీ అంటేనే కొట్లాటలు, గొడవలు.. చంపుకోవడాలు.. గ్యాంగువార్లు గుర్తుకువస్తాయి. అంతేనా.. ఒక్కోసారి అంతకుమించిన అఘాయిత్యాలు సైతం కళ్లముందు కదలాడుతాయి.

Hyderabad: రాజకీయాల వైపు చూస్తున్న పాతబస్తీ రౌడీలు.. పార్టీ టికెట్ల కోసం ఆరాటం
Oldcity
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Aravind B

Updated on: Aug 22, 2023 | 7:36 AM

హైదరాబాద్ న్యూస్, ఆగస్టు 22: ఎప్పుడూ కొట్టుకోవడం.. చంపుకోవడమేనా.. బోరు కొడుతోంది గురూ అంటున్నారు రౌడీషీటర్లు. మనమూ రాజకీయాల్లోకి వచ్చి ఆ దర్జాను అనుభవిద్దామంటున్నారు. ఇంతకు ఆ రౌడీషీటర్లు ఎవరు? రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. వాస్తవానికి పాతబస్తీ అంటేనే కొట్లాటలు, గొడవలు.. చంపుకోవడాలు.. గ్యాంగువార్లు గుర్తుకువస్తాయి. అంతేనా.. ఒక్కోసారి అంతకుమించిన అఘాయిత్యాలు సైతం కళ్లముందు కదలాడుతాయి. ఆ రేంజ్‌ రౌడీషీటర్లు పాతబస్తీలో ఉన్నారు మరి. గ్రూపులుగా ఏర్పడి.. గ్యాంగ్‌వార్‌లకు దిగుతూ ప్రజలను భయపెట్టడమేకాకుండా.. రాజకీయనేతలకు సైతం ఒక్కోసారి తలనొప్పిగా మారుతున్నారు. అలాంటి వారు ఏకంగా రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? అవును పాతబస్తీలో ఇప్పుడు అదే హాట్‌టాపిక్‌గా మారింది.

కబ్జాలు, లూటీలు.. అడొచ్చినవారిని చంపేస్తూ నానా బీభత్సం చేసిన పేరు మోసిన పాతబస్తీ రౌడీషీటర్లు క్రమంగా రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. చంపుకోవడాలు, కొట్లాటలు, సెటిల్‌మెంట్లు ఇంకెన్నాళ్లు చేస్తామంటున్నారు. అందుకే కాస్త ప్రజాసేవ చేస్తామని చెబుతున్నారు. ఇప్పటివరకు రాజకీయనేతలకు అండగా నిలుస్తూ.. వారు చెప్పిందల్లా చేస్తూ కంటికి రెప్పలా ఉన్నారు. అదేంటోగాని వారిలో ఒక్కసారిగా మార్పువచ్చింది. చాలు.. ఇకచాలు రాజకీయనేతలకు చేసిన ఊడిగం చాలంటున్నారు. ఇంకేముంది? అనుకున్నదే తడవుగా తామెందుకు రాజకీయాల్లోకి రాకూడదని ప్రశ్నిస్తున్నారు. ఇకపై రాజకీయనేతలకు పనులుచేసి పెట్టడం మానేసి.. తామే ప్రజాసేవకు అంకితమవుతామని తేల్చిచెబుతున్నారు. ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క అంటున్నారు.

ఏ రాజకీయనేతకూ తలొంచొద్దని తీర్మానించుకున్నారు. గొడవలు, కొట్లాటలకు మాని.. ప్రజాసేవలో నిమగ్నం అయ్యేందుకు రెడీ అయ్యారు. ఎన్నో కేసుల్లో జైలు జీవితం అనుభవించిన పలువురు రౌడీషీటర్లు.. జైలులో తత్వం బోధపడిందంటున్నారు. జైలు బయటకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతకాలంగా ప్రజలతో మమేకమవుతూ తాము ప్రజాసేవ చేయగలమని నిరూపిస్తున్నారు. ఓ రాజకీయనేత కోసం పనిచేస్తే.. మరోనేతకు కోపం రావడం.. వారి కోసం జైలు పాలుకావడం పరిపాటిగా మారిన తరణంలో రౌడీషీటర్లు రూటుమార్చారు. ఇకపై ఎవ్వరికోసం పనిచేయబోమని తేల్చిచెబుతున్నారు. ఏ రాజకీయనేత మోచేతి నీళ్లు తాగడానికి ఇష్టపడడం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమసత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అవకాశం ఇస్తే తామేంటో చూపిస్తామంటూ అన్ని రాజకీయపార్టీల నేతల చుట్టూ చక్కర్లుకొడుతున్నారు. కాస్త సీటివ్వండి సార్.. ప్రజాసేవ చేసుకుంటామని బతిమిలాడుతున్నారు. ఇన్నాళ్లు చేసింది మనసులో పెట్టుకోకుండా ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

రౌడీషీటర్ల వినతిని రాజకీయపార్టీలు మన్నిస్తాయా? వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి ప్రోత్సహిస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది. సీటు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్న రౌడీషీటర్ల భవితవ్యం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిరేపుతోంది. మరోవైపు రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఫోకస్‌ చేయడం ప్రారంభించన నేపథ్యంలో వారి రాజకీయ అరంగేట్రం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకు వారు రాజకీయాల్లోకి రావాలనుకునేది.. ప్రజాసేవకేనా? లేక వారి ఆస్తులు, ప్రాణాలను కాపాడుకోవడానికా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరికొద్దిరోజుల్లో వారి రాజకీయభవితవ్యాన్ని కాలం ఎలా నిర్ణయిస్తుందో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం