Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బీజేపీ నేత శరణ్ చౌదరి అదృశ్యం.. ఆ నలుగురే కారణమా..?

Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ నేత మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ నేత కారులో ఎక్కగా, ఆయనతో పాటు గుర్తు తెలియని ఓ నలుగురు వ్యక్తులు ఎక్కారంట. అప్పుడే స్విచ్ ఆఫ్ అయిన ఆయన ఫోన్, ఇప్పటికీ ఆన్ కాకపోవడంతో సదరు నేత కుటుంబం సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: బీజేపీ నేత శరణ్ చౌదరి అదృశ్యం.. ఆ నలుగురే కారణమా..?
BJP Leader Saran Chowdary
Follow us
Noor Mohammed Shaik

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 22, 2023 | 12:29 AM

హైదరాబాద్, ఆగస్టు 23: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి మిస్పింగ్ కేసు ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలంగా మారింది. సోమవారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన శరణ్ చౌదరి అప్పటి నుంచి కనిపించడంలేదు. ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులో ఆయన ఎక్కగా, ఆయనతో పాటు మరో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఎక్కారని సమాచారం. అదే సమయంలో ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వగా, అది ఇప్పటి వరకు స్విచ్ ఆన్ కాలేదని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన కార్ డ్రైవర్, సహాయకుడి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో శరణ్ చౌదరి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు శరణ్ చౌదరి మిస్సింగ్ కావడంతో ఫిర్యాదు అందుకొన్న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, శరణ్ చౌదరి వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే ఆయన మిస్సింగ్ కేసు కలకలంగా మారింది.