మ్యాట్రిమోనీలో వ‌రుడి కోసం యువ‌తి ప్రకటన.. హార్ట్‌ సర్జన్‌తో ఆన్‌లైన్‌ ప్రేమ..! చివరకు పాపం..

తన కుమారుడు హార్ట్ సర్జన్ అంటూ నమ్మించి తన కుమారుడి కాంటాక్ట్ షేర్ చేస్తానంటూ శరణ్యతో మాటలు కలిపాడు. తన కుమారుడి పేరు ఆది జవేశ్..గా చెబుతూ ఒక కంటాక్ట్ నంబర్ ఇచ్చాడు... వెంటనే ఆ నంబర్ను సంప్రదించిన యువతి కొద్ది రోజులపాటు అతనితో మాట్లాడింది. ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటు మంచి సంబంధం ఏర్పడింది...ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి..

మ్యాట్రిమోనీలో వ‌రుడి కోసం యువ‌తి ప్రకటన.. హార్ట్‌ సర్జన్‌తో ఆన్‌లైన్‌ ప్రేమ..! చివరకు పాపం..
Marriage
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 21, 2023 | 9:35 PM

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు అంతకింతకి విస్తరిస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త పందాలులో సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తూ లక్షలు కాజేస్తున్నారు కేటుగాళ్లు.. తాజాగా భారత్ మాట్రిమోనీ సైట్ ద్వారా హైదరాబాద్ యువతీని ఏకంగా రూ. 27 లక్షలు మోసగించాడు ఓ కేటుగాడు… తాను అమెరికాలో హార్ట్ సర్జన్ అంటూ నమ్మించి భారత్ మ్యాట్రిమోనీలో ఓ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ప్రొఫైల్ పై శరణ్య అనే యువతీ ఇంట్రెస్ట్ చూపించటంతో ఎలాగైనా సరే బాధితురాల్ని మోసం చేయాలని భావించి తనతో పరిచయం పెంచుకున్నారు. మొదట శరణ్య ప్రొఫైల్ తో టచ్ లోకి వచ్చాడు ఒక కేటుగాడు. తన కుమారుడు హార్ట్ సర్జన్ అంటూ నమ్మించి తన కుమారుడి కాంటాక్ట్ షేర్ చేస్తానంటూ శరణ్యతో మాటలు కలిపాడు. తన కుమారుడి పేరు ఆది జవేశ్..గా చెబుతూ ఒక కంటాక్ట్ నంబర్ ఇచ్చాడు… వెంటనే ఆ నంబర్ను సంప్రదించిన యువతి కొద్ది రోజులపాటు అతనితో మాట్లాడింది. ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటు మంచి సంబంధం ఏర్పడింది…ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్న తరుణంలో భారీ ప్లాన్ రచించాడు కేటుగాడు…

తాను పని నిమిత్తం సిరియా వెళ్తున్నట్టు శరణ్య కు చెప్పాడు…సిరియా లో తన బెస్ క్యాంప్ పై టెర్రరిస్ట్ లు దాడి చేశారని తీవ్రంగా నష్టపోయానని చెప్పి కొంత ఆర్థిక సహాయం చేయలనీ అడిగాడు.. కొంత మేరకు సమకూర్చింది బాధితురాలు…మళ్ళీ తనకి గిఫ్ట్స్ తీసుకుంటానని చెప్పడం తో మరికొంత చెల్లించింది…ఆ తరువాత తమ పెళ్లి కోసం తీసుకున్న గిఫ్ట్స్ ను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో తనని కస్టమ్స్అధికారులు పట్టుకున్నట్టు నమ్మించాడు… అధికారులు విడిచి పెట్టేందుకు రూ.27 లక్షలు చెల్లించాలని బాధితురాలిని నమ్మించడంతో ఈ సారి ఆమె ఏకంగా రూ. 27 లక్షల రూపాయలు చెల్లించింది.

ఆ తర్వాత తనకు తెచ్చిన గిఫ్ట్స్ అన్నిటినీ తన స్నేహితుడు ఎడ్వర్డ్ తీసుకొస్తాడని నమ్మించాడు… ఒకరోజు ఒక నైజీరియా వ్యక్తి వచ్చి బాధితురాలికి ఒక బ్యాగ్ అప్పగించాడు. దాంతో ఎలా అయినా సరే ఆది జవేష్ వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడనీ ఆశతో ఎదురు చూస్తూ ఉండిపోయింది….కానీ ఎన్ని రోజులు గడిచినా తాను రాకపోవడం తో మోసపోయానని గ్రహించింది..

ఇవి కూడా చదవండి

ఒక సారి ఆ బ్యాగ్ లో ఏమైందో చూద్దామని తెరిచే ప్రయత్నం చేసింది..అందులో ఒక డిజీ లాకర్ కనిపించింది…అది కూడా చాలా బరువుగా ఉండటం తో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు…కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!