Monsoon Health Tips: వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండ్లు, కూరగాయలు.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్స్

వర్షాకాలం ప్రజలు వర్షాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ, రుతుపవనాల మార్పుతో ప్రజలు పలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. రుతుపవనాలతో ఫ్లూ, ఇన్ఫెక్షన్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వర్షాకాలంలో కొన్ని సూపర్ ఫుడ్స్ తినాలి.

Monsoon Health Tips: వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండ్లు, కూరగాయలు.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్స్
Monsoon Health Tips
Follow us

|

Updated on: Aug 21, 2023 | 8:21 PM

రోగనిరోధక శక్తి అనేది మనం తినే ఆహారం నుండి మనకు లభిస్తుంది. మన శరీరంలో ఉత్పత్తి కాదు..కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను మనం రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. విటమిన్ ‘C’ కంటెంట్ సిబ్ ఫ్రూట్, బొప్పాయి పండు, నారింజ పండు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, కివీ, కాలే మొదలైన వాటిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏయే పండ్లు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

యాపిల్‌ పండు.. యాపిల్స్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అందుచేత వర్షాకాలంలో యాపిల్ పండును బాగా కడిగి తొక్కతో కలిపి తింటే మంచిది.

లిచీ పండు.. లిచీ పండ్లలో ఉండే విటమిన్ సి కంటెంట్ వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో పోరాడటానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆల్‌బుకర్‌.. కరిగే ఫైబర్‌తో పాటు, రేగు పండ్లలో విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

బెర్రీ పండు.. బెర్రీస్ శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయ. ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి.

దానిమ్మ పండు.. దానిమ్మ పండ్లలో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

వర్షాకాలం ప్రజలు వర్షాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ, రుతుపవనాల మార్పుతో ప్రజలు పలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. రుతుపవనాలతో ఫ్లూ, ఇన్ఫెక్షన్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వర్షాకాలంలో కొన్ని సూపర్ ఫుడ్స్ తినాలి. ఇలాంటి పండ్లతో పాటుగా పసుపు పాలు తీసుకోవటం మంచిది. పసుపు పాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి

పేగు ఆరోగ్యానికి పెరుగు, మజ్జిగ, కేఫీర్, పచ్చికూరగాయలు వంటి ఆహారాలను తీసుకోవాలి. పోషకాల కోసం పాలకూర, కాలే, లేడిఫింగర్ మొదలైన ఆకుపచ్చ కూరగాయలను క్రమం తప్పకుండా తినండి. వర్షాకాలంలో వెల్లు్ల్లి జలుబు నుండి మిమ్మల్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి అల్లం-టీ కూడా ఒక రుచికరమైన మార్గం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..