IND vs IRE: టీమిండియాదే టీ20 సిరీస్.. సమిష్టిగా రాణించిన కుర్రాళ్లు.. ఐరీస్ ఓపెనర్ విరోచిత పోరాటం వృథా..
IND vs IRE, 2nd T20I: నేటి రెండో టీ20లో తేడాతో ఐర్లాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 మ్యాచ్‌ను 2-0 తేడాతో టీమిండియా గెలుచుకుంది. అలాగే బూమ్రాకి టీ20 టీమ్ కెప్టెన్‌గా ఇది తొలి సిరీస్, ఇంకా తొలి సిరీస్ విజయం కావడం విశేషం. మ్యాచ్ విషయానికి వస్తే.. ఐరీష్ టీమ్ ఓపెనర్ 72 పరుగులతో టీమిండియాపై వీరోచిత పోరాటం చేసిన తన జట్టుకు విజయం అందించలేకపోయాడు. తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్..
IND vs IRE, 2nd T20I: జస్ప్రీత్ బూమ్రా సారథ్యంలో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లిన టీమిండియా ఖాతాలో మరో టీ20 సిరీస్ చేరింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో గెలిచిన బూమ్రా సేన, నేటి రెండో టీ20లో తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 మ్యాచ్‌ను 2-0 తేడాతో టీమిండియా గెలుచుకుంది. అలాగే బూమ్రాకి టీ20 టీమ్ కెప్టెన్‌గా ఇది తొలి సిరీస్, ఇంకా తొలి సిరీస్ విజయం కావడం విశేషం. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులు చేయగా, ఐరీష్ బ్యాటర్లు 152 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో భారత్ 33 పరుగుల తేడాతో రెండో విజయం సాధించింది.
అంతకముందు టాస్ గెలిచిన ఐర్లాండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ మొత్తాన్ని సాధించారు. ఈ క్రమంలో భారత్ తరఫున రుతురాజ్ గైక్వాడ్(58) హాఫ్ సెంచరీతో రాణించగా.. సంజూ శామ్సన్ 40, రింకూ సింగ్ 38, శివమ్ దుబే అజేయంగా 22 పరుగులతో ఆకట్టుకున్నారు. ఐరీష్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ 2 వికెట్ల తీయగా.. క్రైయిగ్ యంగ్, బెంజమిన్ యంగ్, మార్క్ అడైర్ తలో వికెట్ పడగొట్టారు. అయితే అనంతరం 186 పరుగుల లక్ష్యంతో ఐర్లాండ్ తరఫున బరిలోకి దిగిన అండ్రూ బల్బిర్నీ 72 పరుగులతో రాణించాడు. కానీ తొటి ప్లేయర్లు నుంచి సహాయం లభించకపోవడంతో అతని శ్రమ వృథా అయిపోయింది. చివర్లో మార్క్ అడైర్ మూడు సిక్సర్లతో 23 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో రెండేసి వికెట్లు తీసుకోగా… అర్ష్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.
టీ20 సిరీస్ మనదే..
India gain an unassailable series lead with a win in the second T20I 👌#IREvIND | 📝: https://t.co/4Jgi1BzBOM pic.twitter.com/TAhSWeG1N6
— ICC (@ICC) August 20, 2023
హాఫ్ సెంచరీ వీరుడు..
టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 ఫోర్‌తో మొత్తం 58 పరుగులు చేశాడు. అలాగే తన కెరీర్‌లో రెండో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
FIFTY!
A fine half-century by @Ruutu1331. He tops it up with a maximum soon after 👏👏
This is his 2nd 50 in T20Is.
Live – https://t.co/I2nw1YQmfx…… #IREvIND pic.twitter.com/pN400ddoCQ
— BCCI (@BCCI) August 20, 2023
సిక్సర్స్ సింగ్..
ఐపీఎల్‌లో సిక్సర్ల మోత మోగించిన రింకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఆరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్ లభించకపోయినా.. రెండో మ్యాచ్‌లో దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆడిన 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మార్క్ అడైర్ వేసిన చివరి ఓవర్‌లో మరో సిక్సర్ బాదే ప్రయత్నం చేసినా.. క్రెయిగ్ యంగ్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. అలాగే ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Rinku Singh’s fine cameo comes to an end on 38 runs.
How good was he in his first outing with the bat?
Live – https://t.co/I2nw1YQmfx… #IREvIND pic.twitter.com/hiOgv2nW3S
— BCCI (@BCCI) August 20, 2023
బల్బిర్నీ విరోచితం..
ప్రత్యర్థి టీమ్‌లో ఒకే ఒక్కడుగా నిలిచాడు ఐర్లాండ్ ఓపెనర్ అండ్రూ బల్బిర్నీ. భారత బౌలర్లు పటిష్టమైన బౌలింగ్ వేస్తున్నప్పటికీ.. బల్బిర్నీ 51 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి విరోచితంగా పోరాడాడు.
Well played, Andrew Balbirnie!
72 in 51 balls with 5 fours and 4 sixes – tried his best to take Ireland closer, a terrific display of batting by Balbirnie.#AndrewBalbirnie #Balbirnie #SanjuSamson #RinkuSingh #INDvsIRE #INDvIRE #Bumrahpic.twitter.com/g666eW6SYt
— Cricket SuperFans (@cricketrafi) August 20, 2023
కాగా, భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌లో ఇంకా మిగిలి ఉన్న మూడో మ్యాచ్ ఆగస్టు 23న అంటే బుధవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.