IND vs IRE: అరుదైన ఘనత సాధించిన అర్ష్‌దీప్.. చాహల్‌ని అధిగమించి ఆ లిస్టులో రెండో భారతీయుడిగా..
IND vs IRE 2nd T20I: రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ తరఫున 72 పరుగులతో మెరుగ్గా రాణిస్తున్న ఆండ్రూ బల్బిర్నీని అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 50వ వికెట్‌ను పడగొట్టాడు. అయితే యుజ్వేంద్ర చాహల్ 34 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీయగా.. ఈ మైలురాయిని చేరుకోవడం కోసం అర్ష్‌దీప్ 33 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా 50 టీ20 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా..
IND vs IRE 2nd T20I: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా టీమిండియానే విజయం సాధించడంతో.. టీ20 సిరీస్‌ని భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ ద్వారా తొలి సారి బ్యాటింగ్ చేసి 21 బంతుల్లో 38 పరుగులు చేసిన రింకూ సింగ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. అయితే ఇదే మ్యాచ్‌లో కేలవం ఒక్క వికెట్ తీసిన ఆర్ష్‌దీప్ ఓ అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. అంతేకాక యుజ్వేంద్ర చాహల్ కంటే ఆ మైలు రాయిని చేరుకుని, ఆ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్‌గా అవతరించాడు. ఇంతకీ ఆర్ష్‌దీప్ ఏం చేశాడంటే..
రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ తరఫున 72 పరుగులతో మెరుగ్గా రాణిస్తున్న ఆండ్రూ బల్బిర్నీని అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 50వ వికెట్‌ను పడగొట్టాడు. అయితే యుజ్వేంద్ర చాహల్ 34 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీయగా.. ఈ మైలురాయిని చేరుకోవడం కోసం అర్ష్‌దీప్ 33 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా 50 టీ20 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇక ఆర్ష్‌దీప్ కంటే ముందు ఈ లిస్టులో 29 ఇన్నింగ్స్‌ల్లోనే 50 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. మరోవైపు వేగంగా 50 వికెట్లు తీసిన టీమిండియా ఫాస్ట్ బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్ అవతరించాడు.
‘హాఫ్ సెంచరీ’ వికెట్లు..
🇮🇳🚨 𝗠𝗜𝗟𝗘𝗦𝗧𝗢𝗡𝗘 𝗔𝗟𝗘𝗥𝗧! 50 wickets in T20I cricket for Arshdeep Singh.
🙌🏻 Congrats to the fiery pacer on this milestone.
📷 Getty • #ArshdeepSingh #IREvIND #INDvIRE #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/by27ab2dXN
— The Bharat Army (@thebharatarmy) August 20, 2023
వేగవంతమైన రెండో బౌలర్..
Arshdeep Singh becomes the 2nd fastest Indian to complete 50 T20i wickets! pic.twitter.com/mtBApXvv7a
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2023
వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్..
New achievement unlocked 🔝
Arshdeep Singh became the fastest Indian pacer to 50 T20I wickets! 🔥🎯
📷: BCCI#ArshdeepSingh #IREvIND #SportsKeeda pic.twitter.com/19sgn2je3m
— Sportskeeda (@Sportskeeda) August 20, 2023
భారత్ ఖాతాలో మరో సిరీస్..
A win by 33 runs in the 2nd T20I in Dublin 👏#TeamIndia go 2⃣-0⃣ up in the series!
Scorecard ▶️ https://t.co/vLHHA69lGg #TeamIndia | #IREvIND pic.twitter.com/TpIlDNKOpb
— BCCI (@BCCI) August 20, 2023
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్..
For his crucial and entertaining knock down the order, Rinku Singh receives the Player of the Match award 👏👏#TeamIndia complete a 33-run victory in Dublin 🙌
Scorecard ▶️ https://t.co/vLHHA69lGg#IREvIND | @rinkusingh235 pic.twitter.com/OhxKiC7c3h
— BCCI (@BCCI) August 20, 2023
కాగా, ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంకా మిగిలి ఉన్న మూడో టీ20 మ్యాచ్.. ఆగస్టు 23న అంటే బుధవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.