IND vs IRE: రింకూ సిక్సర్ల దెబ్బకి తిలక్ వర్మ రికార్డ్ గల్లంతు.. భారత్ తరఫున అత్యుత్తమ టీ20 ప్లేయర్‌గా..
IND vs IRE, 2nd T20I: ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేట్ర ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ 21 బంతుల్లోనే 38 పరుగులతో రాణించాడు. అలాగే తన వీరబాదుడుతో తొలిసారిగా మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డ్‌ను కూడా అందుకున్నాడు. అయితే రింకూ సింగ్ ఈ 38 పరుగుల ద్వారా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పేరిట ఉన్న ఓ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేశాడు. ఇంతకీ ఆదేం రికార్డ్ అంటే..
Updated on: Aug 21, 2023 | 8:25 AM

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇక తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకున్నా.. రెండో మ్యాచ్‌లో దక్కిన అవకాశాన్ని రింకూ సింగ్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో రింకూ 180.95 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇదే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ పేరిట ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేసేలా చేసింది.

అవును, 180.95 స్ట్రైక్ రేట్‌తో ఆడిన రింకూ.. తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్‌గా తిలక్ వర్మ పేరిట ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఆరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. తన తొలి ఇన్నింగ్స్‌లోనే 177.27 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. తద్వారా తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కానీ ఆ రికార్డ్‌ని ఇప్పుడు రింకూ సింగ్ సొంతం చేసుకున్నాడు.

కాగా, బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రింకూ సింగ్ తన అద్భుత ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.





























