Team India: ఆసియా కప్ కోసం 17 మంది ఆటగాళ్లతో టీమిండియా.. లిస్టులో ఎవరున్నారంటే?

Asia Cup 2023: ఈసారి ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నేపాల్‌తో తలపడనుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో తలపడడం ద్వారా టీమిండియా ఆసియా కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. మొత్తంగా ఈ ట్రోఫీ కోసం ఆరు జట్లు పోటీపడనున్నాయి. మొత్తం 17 మంది సభ్యుల గ్రూప్‌లో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Team India: ఆసియా కప్ కోసం 17 మంది ఆటగాళ్లతో టీమిండియా.. లిస్టులో ఎవరున్నారంటే?
Team India Asia Cup 2023
Follow us
Venkata Chari

|

Updated on: Aug 20, 2023 | 10:00 PM

Asia Cup 2023: ఆసియా కప్ ప్రారంభానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ టోర్నీకి ఇప్పటికే పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జట్లను ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం భారత జట్టును ప్రకటించనున్నట్లు సమాచారం వస్తోంది. అయితే ఈ జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఎందుకంటే ఈసారి ఆసియా కప్‌‌నకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేస్తున్నారు. వీరిలో 15 మంది వన్డే ప్రపంచకప్‌లో కనిపించవచ్చు. ఇంతకాలం జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, శ్రేయాస్‌ అయ్యర్‌లు కూడా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురి రాకతో కొందరు ఆటగాళ్లకు స్థానం లభించకపోవచ్చు.

ఆసియా కప్ ట్వీట్స్..

ఎవరికి మొండిచేయి చూపిస్తారో రేపు తేలనుంది. మొత్తం 17 మంది సభ్యుల గ్రూప్‌లో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీని ప్రకారం, టీమ్ ఇండియా ప్రాబబుల్ స్వ్కాడ్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

శాంసన్‌ను చేర్చాలంటూ డిమాండ్..

రోహిత్ శర్మ (కెప్టెన్)

శుభమాన్ గిల్

విరాట్ కోహ్లీ

కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్)

శ్రేయాస్ అయ్యర్

హార్దిక్ పాండ్యా

రవీంద్ర జడేజా

జస్ప్రీత్ బుమ్రా

మహ్మద్ షమీ

కుల్దీప్ యాదవ్

మహ్మద్ సిరాజ్

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

అక్షర్ పటేల్

శార్దూల్ ఠాకూర్

సూర్యకుమార్ యాదవ్

తిలక్ వర్మ

రవిచంద్రన్ అశ్విన్

ఇక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ క్లియరెన్స్ వస్తేనే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎంపిక చేస్తారు. అలాగే అశ్విన్‌ను తప్పిస్తే యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. అలాగే ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో యువ ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌లలో లక్ ఎవరివైపు ఉందో చూడాలి. దీంతో తుది 17 మంది సభ్యుల గ్రూప్‌లో ఎవరు కనిపిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఆసియా కప్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈసారి ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నేపాల్‌తో తలపడనుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో తలపడడం ద్వారా టీమిండియా ఆసియా కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అందువల్ల భారత జట్టు తొలి మ్యాచ్‌లో హోరాహోరీ పోటీని ఆశించవచ్చు.

రేపు ప్రకటన..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..