Chiranjeevi: అంచనాలకు మించేలా మెగాస్టార్ 157.. అదిరిపోయిన పోస్టర్

ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ కూడా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వచ్చిన భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా పై ఆశలు పెంచుకున్నారు చిరు ఫ్యాన్స్. ఈ సారి మెగాస్టార్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని గట్టిగానే చెప్తున్నారు.

Chiranjeevi: అంచనాలకు మించేలా మెగాస్టార్ 157.. అదిరిపోయిన పోస్టర్
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 22, 2023 | 11:53 AM

కుర్రహీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలను చేసుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన లైనప్ చేసిన సినిమాలు అభిమానులకు కొత్త ఉత్సహాన్ని ఇస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ కూడా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వచ్చిన భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా పై ఆశలు పెంచుకున్నారు చిరు ఫ్యాన్స్. ఈ సారి మెగాస్టార్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని గట్టిగానే చెప్తున్నారు. ఈ క్రమంలోనే నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కొత్త మూవీని అనౌన్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనౌన్స్ చేశారు యూవీ క్రియేషన్స్. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేశాడు వశిష్ఠ. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్లాప్స్ లో కొట్టుమిట్టాడుతున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది. బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వశిష్ఠకు సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కూడా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని అర్ధమవుతుంది. ఒక స్టార్ సింబల్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అలాగే ఆ స్టార్ లో పంచభూతాలైన.. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంను చూపించారు. ఈ పంచభూతాల శక్తి మెగాస్టార్ అంటూ ఈ పోస్టర్ ను శోషొల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. దాంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుపనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!