AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఒడిలో కూర్చున్న ఈ చిన్నోడు గుర్తున్నాడా ?.. ఇప్పుడు టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో చిరుతో తాను చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. పైన ఫోటోను చూశారు కదా. చిరు ఒడిలో కూర్చున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో. ఇప్పుడిప్పుడే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రోటీన్ హీరోయిజం చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఒడిలో కూర్చున్న ఈ చిన్నోడు గుర్తున్నాడా ?.. ఇప్పుడు టాలీవుడ్ హీరో..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2023 | 11:35 AM

Share

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. తెలుగు యూత్‏ను తన డ్యాన్స్‏లతో ఊర్రూతలుగించారు. ఎన్నో అవమానాలు.. ప్రతి అడుగులో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పట్టుదలతో ఇండస్ట్రీలోనే మెగాస్టార్ అయ్యారు. ఈరోజు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా గత రెండు రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో చిరు బర్త్ డే సంబరాలు మొదలయ్యాయి. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పక్కర్లేదు. చిరుకు సంబంధించిన లేటేస్ట్, త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తూ అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో చిరుతో తాను చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. పైన ఫోటోను చూశారు కదా. చిరు ఒడిలో కూర్చున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో. ఇప్పుడిప్పుడే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రోటీన్ హీరోయిజం చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?. తనే హీరో తేజ సజ్జా.

తేజ సజ్జా.. తెలుగు సినీ పరిశ్రమలోకి బాలనటుడిగా అడుగుపెట్టారు. 1998లో చూడాలని ఉంది సినిమాతో సినీరంగంలోకి బాలనటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన రాజకుమారుడు, కలిసుందాం రా, యువరాజు, బాచి, సర్దుకుపోదాం రండి, గంగోత్రి వంటి అనేక చిత్రాల్లో బాలనటుడిగా కనిపించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో చిన్ననాటి చిరు పాత్రలో నటించి అదరగొట్టారు తేజ. అలాగే ఠాగూర్ చిత్రంలోనూ చిరు వద్ద పిల్లలలో ఒకరిగా కనిపించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన తేజ.. 2019లో ఓ బేబీ సినిమాతో హీరోగా కనిపించారు.

తేజ సజ్జా ట్వీట్..

సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. ఆ తర్వాత జాంబీ రెడ్డి సినిమాలో నటించి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన ఇష్క్, అద్భుతం చిత్రాలు థియేటర్లలో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయాయి. ప్రస్తుతం తేజ హనుమాన్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

తేజ సజ్జా ట్వీట్..

ఈరోజు చిరు బర్త్ డే సందర్భంగా ఆయనతో తాను చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తేజ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తేజ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి