AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి.. 22 మంది మృతి! ప్రధాని మోదీ సంతాపం

నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్‌ కూలి 22 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మిజోరాంలో బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైరాంగ్‌ ప్రాంతంలో రోజు మాదిరిగానే కార్మికులు రైల్వే బ్రిడ్జి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో కార్మికులు శిధిలాల కింద..

ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి.. 22 మంది మృతి! ప్రధాని మోదీ సంతాపం
Railway Bridge Collapsed In Mizoram
Srilakshmi C
|

Updated on: Aug 24, 2023 | 10:50 AM

Share

మిజోరాం, ఆగస్టు 24: నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్‌ కూలి 22 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మిజోరాంలో బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైరాంగ్‌ ప్రాంతంలో రోజు మాదిరిగానే కార్మికులు రైల్వే బ్రిడ్జి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో కార్మికులు శిధిలాల కింద పడి మృతి చెందారు. ఇప్పటి వరకూ 22 మంది కార్మికుల మృత దేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి కుప్ప కూలిన సమయంలో దాదాపు 40 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నట్లు సమాచారం. అక్కడ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. కూలిపోయిన ఉక్కు నిర్మాణం కింద మరో నాలుగు మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. భైరవి-సాయిరాంగ్ మధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్ ఇది. వంతెన కుప్పకూలిన సంఘటనపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

రైల్వే అధికారుల బృందం, జోన్‌లోని సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుందని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సబ్యసాచి దే మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్‌ చేయండి.