AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: చందమామ వనరులపై హక్కులు ఎవరివి ?.. అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ - 3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం సాయంత్రం విక్రమ్ ల్యాండర్‌ సురక్షింతగా దిగడంతో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇప్పటివరకు ఏ దేశం వెళ్లలేని చంద్రని దక్షిణ ధ్రువంపై కాలుమోపడంతో భారత్ తన ఖ్యాతిని చాటిచెప్పింది. వాస్తవానికి చంద్రునిపైకి వెళ్లేందుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. కానీ..

Chandrayaan 3: చందమామ వనరులపై హక్కులు ఎవరివి ?.. అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే
Moon
Aravind B
|

Updated on: Aug 24, 2023 | 11:52 AM

Share

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం సాయంత్రం విక్రమ్ ల్యాండర్‌ సురక్షింతగా దిగడంతో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇప్పటివరకు ఏ దేశం వెళ్లలేని చంద్రని దక్షిణ ధ్రువంపై కాలుమోపడంతో భారత్ తన ఖ్యాతిని చాటిచెప్పింది. వాస్తవానికి చంద్రునిపైకి వెళ్లేందుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఇప్పుడు వరకు కేవలం మాడు మాత్రమే దానిపై అడుగుపెట్టాయి. ఇప్పుడు ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంతకు ముందు సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనాలు జాబిల్లిపై కాలుమోపాయి. ఆ మూడూ భూమికి కన్పించే వైపు చంద్రుడిపై అడుగుపెట్టగా.. భారత్ చేపట్టిన చంద్రయాన్‌-3 మాత్రం ఇప్పటివరకు మానవాళికి కనిపించని దక్షిణధ్రువాన్ని ముద్దాడి కొత్త అధ్యయనాన్ని లిఖించింది.

అయితే చంద్రునిపై పరిశోధనలు చేయాలని ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగి.. వరుసగా వ్యోమనౌకలను అక్కడికి పంపుతున్న నేపథ్యంలో.. చందమామపై ఉన్న ఖగోళ వస్తువు, అక్కడి వనరులపై హక్కులు ఎవరు సొంతం చేసుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై కూడా అంతర్జాకీయ చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. చందమామ మానవాళి మొత్తానిది. ఇక వివరాల్లోకి వెళ్తే 1966లోనే ఐక్యరాజ్యసమితి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఔటర్ స్పెస్ ట్రీటిని తీసుకొచ్చింది. అయితే దీని ప్రకారం చూసుకుంటే చంద్రుడు, ఇతర ఖగోళ వస్తువులపై కూడా ఏ దేశమూ తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనం కోసమే ఖగోళంలో పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంలో కేవలం ప్రభుత్వాలకు సంబంధించిన ప్రస్తావన మాత్రమే ఉంది. కానీ చంద్రునిపై ఏదైన ప్రాంతంలో ఏదైన దేశం తమ హక్కలను ప్రకటించుకోవచ్చా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

ఈ క్రమంలోనే 1979లో మరోసారి చందమామ ఒప్పందం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే ఏ ప్రభుత్వ, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలు గానీ లేదా వ్యక్తులు గానీ చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అక్కడ కాలనీలను ఏర్పాటు చేసుకొని.. ఈ ప్రాంతం మాదే అని అనడం చెల్లదు. చందమామ, దానిపై ఉండే సహజవనరులన్నీ కూడా మానవులందరీ ఉమ్మడి సొత్తు. 1984వ సంవత్సరంలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు చంద్రునిపైకి ల్యాండర్లు పంపినటువంటి అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రం ఆ ఒప్పందాన్ని ఆమోదించలేదు. అయితేఅంతరిక్ష ఒప్పందానికి కొనసాగింపు కోసం అమెరికా 2020వ సంవత్సరంలో అర్టెమిస్‌ అనే ఒప్పందాన్ని ప్రతిపాదించింది. చంద్రునిపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందంలో జపాన్, కెనడా, ఐరోపా తదితర దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇటీవలే భారత్ కూడా ఇందులో చేరింది. ఇదిలా ఉండగా ఇక భవిష్యత్తులో చంద్రునిపై హక్కుల విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..