AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్ మేనేజర్ దుర్మరణం.. పూర్తి వివరాలివే..

Hyderabad: గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. మదీనాగూడలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌ను ఘటనాస్థలంలోని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్‌ డీసీపీ సందీప్‌, మియాపూర్‌ పోలీసులు అక్కడ 6 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరణించిన దేవేందర్‌ను ఘటనాస్థలంలోనే ఉన్న కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్‌ జనరల్‌ మేనేజర్‌గా..

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్ మేనేజర్ దుర్మరణం.. పూర్తి వివరాలివే..
Spot Visuals; Devender
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 24, 2023 | 6:04 AM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 24: హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నగర పరిధిలోని మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం దేవేందర్‌ గాయన్‌ అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. మదీనాగూడలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌ను ఘటనాస్థలంలోని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్‌ డీసీపీ సందీప్‌, మియాపూర్‌ పోలీసులు అక్కడ 6 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరణించిన దేవేందర్‌ను ఘటనాస్థలంలోనే ఉన్న కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్‌ జనరల్‌ మేనేజర్‌గా గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే దేవేందర్‌పై దాడి చేసినవారు మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని, మృతుడు వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. దేవేందర్ హోటల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతనిపై కాల్పులు జరిపారని, కాల్పుల కోసం కంట్రీ మేడ్ పిస్టల్‌ని ఉపయోగించారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే దేవేందర్ 6 నెలలుగా కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని, అతనిపై కాల్పులు జరిపిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని మియాపూర్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?