AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: చాహల్‌పై వేటు వేయడానికి ఇవే కారణాలా..? ఈ ముగ్గురిపై నమ్మకంతోనే రోహిత్ ఇలా చేశాడా..?

Asia Cup 2023: కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి పలువురు ఆటగాళ్లకు ఆసియా కప్ పునరాగమ టోర్నీ కావడం విశేషం. అయితే ఆసియా కప్ టోర్నమెంట్ కోసం ఎంపిక అయిన 17 మంది ప్లేయర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ పేరు లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. భారత్ తరఫున మెరుగ్గా రాణిస్తున్న ఈ స్పిన్నర్‌ని జట్టు నుంచి తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. చాహల్‌‌ని ఎంపిక చేయకపోవడానికి కారణాలు కూడా..

Asia Cup 2023: చాహల్‌పై వేటు వేయడానికి ఇవే కారణాలా..? ఈ ముగ్గురిపై నమ్మకంతోనే రోహిత్ ఇలా చేశాడా..?
Yuzvendra Chahal
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 22, 2023 | 7:53 AM

Share

Asia Cup 2023: ఆసియా కప్ టోర్నీ కోసం 17 మందితో కూడిన భారత్ జట్టును సోమవారం ప్రకటించారు. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ ద్వారా భారత్ తరఫున తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వన్డే ఆరంగేట్రం చేయబోతున్నాడు. అలాగే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి పలువురు ఆటగాళ్లకు ఇది పునరాగమ టోర్నీ కూడా కావడం విశేషం. అయితే ఆసియా కప్ టోర్నమెంట్ కోసం ఎంపిక అయిన 17 మంది ప్లేయర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ పేరు లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. భారత్ తరఫున మెరుగ్గా రాణిస్తున్న ఈ స్పిన్నర్‌ని జట్టు నుంచి తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. చాహల్‌‌ని ఎంపిక చేయకపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. అవేమిటంటే..

భారత జట్టు ఇదే.. 

ఒక లెగ్ స్పిన్నర్ చాలు: టీమిండియా సెలెక్టర్లు ఆసియా కప్ కోసం చాహల్‌ని ఎంపిక చేయకపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణంగా ఏమిటంటే.. జట్టులో ఓ లెగ్ స్పిన్నర్ ఉంటే సరిపోతుందని అనుకోవడం. ఇటీవలి కాలంలో కుల్దీప్ యాదవ్ లెగ్ స్పిన్నర్‌గా వన్డేల్లో మెరుగ్గానే రాణిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 7 వికెట్లు పడగొట్టాడు. ఈ కారణంగానే సెలెక్టర్లు కుల్దీప్‌ని ఆసియా కప్ కోసం జట్టులోకి తీసుకున్నాడు. కుల్దీప్ కాకుండా అదనపు లెగ్ స్పిన్నర్ ఉండడం మంచిదే కానీ ఆ స్థానంలో మరో ప్లేయర్‌గా తీసుకోవచ్చని సెలెక్టర్లు భావించి ఉండవచ్చు.

బౌలింగ్ చేయగలం..

బ్యాటింగ్ డెప్త్: భారత జట్టులో బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంటుంది. కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేసిన సందర్భాల్లో టెయిలెండర్లు జట్టుకు మెరుగైన స్కోర్ అందించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ వంటివారు గతంలో  మెరుగ్గా పనిచేశారు. యుజ్వేంద్ర చాహల్ విషయానికి వస్తే.. చాహల్ ఎప్పుడూ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూనే వచ్చాడు. ఈ కారణంగానే చాహల్‌పై వేటు పడి ఉండవచ్చు.

వన్డే లెక్కలు

వేటు పడుతూనే ఉంది..

కెప్టెన్‌కి నమ్మకం లేకపోవడం: మెగా టోర్నీల్లో చాహల్‌కి అనుభవం తక్కువ. 2021 టీ20 ప్రపంచ కప్ కోసం అతను ఎంపిక కాలేదు, ఆ తర్వాత జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్‌లో అతను ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో పెద్ద పెద్ద టోర్నీల్లో చాహల్ రాణించగలడన్న విశ్వాసం రోహిత్ శర్మకి లేకపోవడం కూడా అతనిపై వేటు పడడానికి కారణం అయి ఉండవచ్చు. అయితే చాహల్ గురించి రోహిత్.. అతనికి ఇంకా వరల్డ్ కప్ ఆడేందుకు అవకాశాలు ఉన్నాయన్నట్లుగా స్పందించాడు.

ఏది ఏమైతేనేం లెగ్ స్పిన్నర్‌గా కుల్దీప్.. బ్యాటింగ్‌ చేయగల బౌలర్లలో అక్షర్, శార్దుల్ బెస్ట్ ఆప్షన్లుగా ఉండడంతోనే చాహల్‌కి నిరాశే మిగిలినట్లుగా ఉంది మరోవైపు ఆసియా కప్ కోసం తనను ఎంపిక చేయకపోవడంపై యుజ్వేంద్ర చాహల్ స్పందించాడు. సూర్యుడికి మేఘాలు అడ్డువచ్చాయని, త్వరలోనే ప్రకాశిస్తాడన్న అర్థం వచ్చేలా తన ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..