- Telugu News Photo Gallery Cricket photos IND vs IRE: Jasprit Bumrah Overtakes Hardik Pandya To Become India's 3rd Highest Wicket Taker In T20I Cricket
Jasprit Bumrah: హార్దిక్ రికార్డ్‌ని ‘బౌల్డ్’ చేసిన బూమ్రా.. కట్ చేస్తే, టాప్ 3 లిస్టులో చోటు..
IND vs IRE: భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్ ఇప్పటికే టీమిండియా సొంతమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఐర్లాండ్‌పై గెలిచిన బూమ్రా సేన మరో టీ20 మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌లో ఆధిక్యత సాధించింది. అలాగే ఐర్లాండ్‌పై జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ రెండేసి వికెట్లు పడగొట్టిన బూమ్రా.. హార్దిక్ పాండ్యా పేరిట ఉన్న ఓ రికార్డ్‌ను బౌల్డ్ చేశాడు. అలాగే భారత్ తరఫున అందుకు సంబంధించిన లిస్టులో టాప్ 3 స్థానానికి చేరుకున్నాడు. ఇంతకీ బూమ్రా ఏం చేశాడంటే..?
Updated on: Aug 22, 2023 | 8:23 AM

IND vs IRE: ఐర్లాండ్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జస్ప్రీత్ బూమ్రా.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ టీ20 మ్యాచ్‌కి ముందు ఆ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉండేవాడు.

70 టీ20 వికెట్లు తీసిన బూమ్రా దాదాపు 327 రోజుల పాటు గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలోనే వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్.. బూమ్రాను అధిగమించి మొత్తం 73 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అవతరించాడు.

అయితే గాయం నుంచి తిరిగొచ్చిన బూమ్రా.. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ 2, 2 వికెట్లు తీశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 74 వికెట్లు తీసిన బూమ్రా.. హార్దిక్‌ని అధిగమించాడు. ఇంకా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారతీయుడిగా నిలిచాడు. మరోవైపు హార్దిక్ నాలుగో స్థానానికి దిగిపోయాడు.

కాగా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్ ఇప్పటివరకు 96 వికెట్లు పడగొట్టి ఈ రికార్డ్ సృష్టించాడు.

అలాగే చాహల్ తర్వాత భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. భువీ మొత్తంగా 90 టీ20 వికెట్లు తీశాడు.





























