- Telugu News Photo Gallery Cricket photos 5 players who deserved a spot in India’s squad for Asia Cup 2023, check to know the list
Asia Cup 2023: అర్హత ఉన్నా ‘టీమిండియా’లో అవకాశం దక్కని ప్లేయర్లు.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించారు. మొత్తం 17 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. అర్హత కలిగిన కొంతమంది ప్లేయర్లకు మాత్రం మళ్లీ నిరాశే మిగిల్చింది. ఇంతకీ ఆసియా కప్ కోసం సెలెక్ట్ కానీ ఆ అన్‌లక్కీ ప్లేయర్లు ఎవరంటే..?
Updated on: Aug 22, 2023 | 7:23 AM

యుజ్వేంద్ర చాహల్: ప్రస్తుత కాలంలో భారత్ తరఫున విజయవంతంగా రాణిస్తున్న చాహల్‌కి ఆసియా కప్ ఆడే టీమిండియాలో అవకాశం దక్కలేదు. 72 వన్డేల్లోనే 121 వికెట్లు పడగొట్టిన చాహల్, ఎలాంటి బ్యాటర్‌ని అయినా ఇబ్బంది పెట్టగల స్పిన్నర్.

శిఖర్ ధావన్: ఒకప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడిన టీమిండియా ఓపెనర్ ధావన్. అయితే రోజురోజుకీ ఆటలోకి యువ ఆటగాళ్లు వస్తుండడంతో సెలెక్టర్లు గబ్బర్‌కి మొండిచేయి చూపిస్తున్నారు. ఆసియా క్రీడల కోసం వెళ్లే భారత్ బి జట్టులో ధావన్‌ని కెప్టెన్‌గా నియమిస్తారనే ప్రచారం సాగినా.. అందులోనూ అతనికి నిరాశే కలిగింది. పోనీ ఆసియా కప్ కోసం అయినా ధావన్‌కి అవకాశం వస్తుందేమోనని అంతా అనుకున్నా.. అలా జరగలేదు. ఐసీసీ టోర్నీల్లోనే 6 సెంచరీలు చేసిన ఘనత శిఖర్ ధావన్ సొంతమైన అతనికి అవకాశాలు దక్కడం లేదు.

రవిచంద్రన్ అశ్విన్: భారత్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి కూడా ఆసియా కప్ కోసం పిలుపు రాలేదు. ఫార్మాట్ ఏదైనా తనదైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టే అశ్విన్‌కి ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా నిరాశే మిగిలింది. అయితే అశ్విన్‌కి ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయన్నట్లుగా రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

భువనేశ్వర్ కుమార్: కుమార్ విషయానికి వస్తే ప్రతిభ ఉన్నా అతనికి ప్రతిఫలం దక్కడంలేదు. ఐపీఎల్‌లో రాణిస్తున్నా.. భారత జట్టులోకి అతన్ని తీసుకోవడంలేదు. 121 వన్డేల్లో 141 వికెట్లు పడగొట్టిన ఈ స్వింగ్ కింగ్‌కి ఆసియా కప్ కోసం కూడా అవకాశం లభించకపోవడం ఆశ్చర్యకరం. భువీని ఎంపిక చేయకపోవడంపై ఇప్పటివకే విమర్శలు వినిపిస్తున్నాయి.

సంజూ శామ్సన్: అన్‌లక్కీ ప్లేయర్‌గా ప్రసిద్ధి చెందిన సంజూ శామ్సన్ ఇటీవలే టీ20 క్రికెట్ అవకాశాలు అందుకొని పర్వాలేదనిపిస్తున్నాడు. సంజూ తాను ఆడిన 13 వన్డేల్లోనే 390 పరుగులు చేసినా.. ఆసియా కప్ కోసం ఎంపిక కాలేదు.

ఆసియా కప్ కోసం ఎంపిక అయిన భారత్ జట్టు: రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ




