- Telugu News Photo Gallery Cricket photos No more changes in World Cup 2023 schedule as BCCI denies Hyderabad Cricket Association requests
ODI World Cup 2023: పాకిస్తాన్ మ్యాచ్‌ల తేదీలను మళ్లీ మారుస్తారా? HCA రిక్వెస్టుకు బీసీసీఐ రియాక్షన్ ఏంటంటే?
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీసీఐ ఇప్పటికే తన షెడ్యూల్‌ను మార్చుకుంది. అయితే ఆదివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి షెడ్యూల్‌ను మార్చాలని భారత బోర్డును కోరింది. కానీ ఇప్పట్లో మారే అవకాశం లేదని బీసీసీఐ నిర్ద్వందంగా కొట్టిపారేసింది. ESPNcricinfo వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, BCCI ఇకపై ODI ప్రపంచ కప్ షెడ్యూల్‌ను మార్చబోమని HCAకి తెలిపింది.
Updated on: Aug 21, 2023 | 10:14 PM

వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీసీఐ ఇప్పటికే తన షెడ్యూల్‌ను మార్చుకుంది. అయితే ఆదివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి షెడ్యూల్‌ను మార్చాలని భారత బోర్డును కోరింది. కానీ ఇప్పట్లో మారే అవకాశం లేదని బీసీసీఐ నిర్ద్వందంగా కొట్టిపారేసింది. ESPNcricinfo వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, BCCI ఇకపై ODI ప్రపంచ కప్ షెడ్యూల్‌ను మార్చబోమని HCAకి తెలిపింది.

ఆగస్టు 9, 10 తేదీల్లో HCA వరుసగా రెండు ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది . అయితే మ్యాచ్‌ల నిర్వహణ సమయంలో భద్రతా సమస్యలు తలెత్తవచ్చంటూ ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చాలని హెచ్‌సీఏ అభ్యర్థించింది.

వరుసగా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేమని ఇందులో పేర్కొంది. ఆగస్టు 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా, మరుసటి రోజు పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించి భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్‌సీఏ ఇందులో పేర్కొంది.

నివేదికల ప్రకారం, హెచ్‌సీఏ బిసిసిఐ సందేశాన్ని హైదరాబాద్ పోలీసులకు అందించింది. వారు నాలుగు జట్లకు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లకు శిక్షణ ఇచ్చేందుకు హెచ్‌సీఏకు బీసీసీఐ అనుమతి కూడా ఇచ్చింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నాలుగు జట్లకు తగినన్ని అవకాశాలు లభిస్తాయా లేదా అనే విషయంలో హెచ్‌సీఏ అయోమయంలో పడింది.

అక్టోబర్ 8న శ్రీలంక జట్టు హైదరాబాద్‌కు రానుంది. అదే సమయంలో హైదరాబాద్‌లోనే పాకిస్థాన్, నెదర్లాండ్‌లు తమ ప్రపంచకప్ సమరాన్ని ప్రారంభించనున్నాయి. ఈ రెండు జట్లు అక్టోబర్ 6న తలపడనున్నాయి.ఇంతకుముందు పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ అక్టోబర్ 12న జరగాల్సి ఉండగా షెడ్యూల్ మార్పు కారణంగా అక్టోబర్ 10కి మార్చారు. అక్టోబర్ 15న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా, అక్టోబర్ 14న జరగనుంది. దీంతో అక్టోబర్ 12న జరగాల్సిన పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 10న జరిగింది.

BCCI, ICC ప్రపంచ కప్ షెడ్యూల్‌ను విడుదల చేశాయి, అయితే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మరియు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో బీసీసీఐ తొమ్మిది మ్యాచ్‌ల తేదీలను మార్చింది, అయితే ఈసారి మార్పులు చేయడానికి ఏ మాత్రం కుదరదని హెచ్‌సీఏ అభ్యర్థనును తిరస్కరించింది బీసీసీఐ.





























