Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బ్రిక్స్‌ కూటమిని విస్తరించేందుకు సంపూర్ణ సహకారం.. ప్రపంచశాంతికి సభ్యదేశాలు కృషి చేయాలన్న ప్రధాని మోదీ

BRICS Summit 2023: బ్రిక్స్‌ కూటమిని విస్తరించేందుకు భారత్‌ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు ప్రధాని మోదీ. జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచశాంతికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇదే సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.

PM Modi: బ్రిక్స్‌ కూటమిని విస్తరించేందుకు సంపూర్ణ సహకారం.. ప్రపంచశాంతికి సభ్యదేశాలు కృషి చేయాలన్న ప్రధాని మోదీ
PM Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 23, 2023 | 10:56 PM

బ్రిక్స్‌ కూటమిని విస్తరించేందుకు భారత్‌ సంపూర్ణమద్దతిస్తుందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. భాగస్వామ్య దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడాన్ని తాము స్వాగతిస్తామన్నారు. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్‌బర్గ్‌లో లో జరిగిన 15వ బ్రిక్స్‌ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ . ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని తాము ప్రతిపాదిస్తున్నామన్నారు మోదీ .. బ్రిక్స్‌ భాగస్వామ్య పక్షాలు కూడా ఇందుకు మద్దతు పలుకుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కన్పించింది. గ్రూప్‌ ఫొటో దిగేందుకు వచ్చిన మోదీకి.. అక్కడ మన జాతీయ పతాక రంగులతో ఉన్న ఓ కాగితం కనిపించింది. తాము నిలబడే దగ్గర ఆ కాగితం ఉండటంతో ప్రధాని వెంటనే స్పందించారు. దానిని అక్కడి నుంచి తీసి, తన జేబులో వేసుకున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా కూడా మోదీ మార్గాన్నే అనుసరించారు. అక్కడున్న కాగితాన్ని తీసి.. తన సహాయకులకు అందించారు. ప్లీనరీ సమావేశానికి ముందు ఈ ఘటన జరిగింది.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్రిక్స్‌ కూటమిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. భారత్‌ అధ్యక్షతన జరుగుతోన్న జీ20 సదస్సులో గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోందన్న మోదీ.. బ్రిక్స్‌లోనూ అటువంటి ప్రాముఖ్యతను కల్పించడాన్ని స్వాగతించారు. గ్లోబల్‌ సౌత్‌ అభివృద్ధిలో బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ కీలక పాత్ర పోషిస్తోందన్న ఆయన.. గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ కూటమి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగుతోందన్నారు. రైల్వే రీసెర్చ్‌ నెట్‌వర్క్స్‌, ఎంఎస్‌ఎంఈల మధ్య సహకారం, స్టార్టప్‌ రంగాల్లో తీసుకోవాల్సి చర్యలపై భారత్‌ చేసిన సూచనలతో ఎంతో పురోగతి కనిపిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారత్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి సదస్సులో మోదీ వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించనుందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం తమ లక్ష్యమన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం