Indian Students in US: స్టడీ కోసం అమెరికాకు వెళ్తున్నారా? అ ప్రశ్నలకు సమాధానం చెబితే సేఫ్.. లేదంటే చుక్కలే..!

అమెరికాకు వెళ్తున్న విద్యార్థులను సరైన డాక్యుమెంటేషన్ లేదంటూ ఇమిగ్రేషన్ అధికారులు తిరిగి స్వదేశానికి పంపిస్తున్నారు. ఇటీవల ఒకేరోజు 21 మంది తెలుగు విద్యార్థులను అధికారులు తిరిగి పంపించేశారు. తాజాగా అమెరికాకు వెళ్లాలనుకున్న విద్యార్థులు సైతం ఎక్కడ తమను తిరిగి వెనక్కి పంపిస్తారేమో అని భయాందోళనకు గురవుతున్నారు.. అమెరికాలో ఉన్న యూనివర్సిటీలపై విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం..

Indian Students in US: స్టడీ కోసం అమెరికాకు వెళ్తున్నారా? అ ప్రశ్నలకు సమాధానం చెబితే సేఫ్.. లేదంటే చుక్కలే..!
Indian Students Deported In Us(File Photo)
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 23, 2023 | 10:05 PM

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతున్న తెలుగు విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడి కన్సల్టెన్సీలను నమ్ముకొని అప్పుచేసి అమెరికాకు వెళ్తున్న విద్యార్థులను సరైన డాక్యుమెంటేషన్ లేదంటూ ఇమిగ్రేషన్ అధికారులు తిరిగి స్వదేశానికి పంపిస్తున్నారు. ఇటీవల ఒకేరోజు 21 మంది తెలుగు విద్యార్థులను అధికారులు తిరిగి పంపించేశారు. తాజాగా అమెరికాకు వెళ్లాలనుకున్న విద్యార్థులు సైతం ఎక్కడ తమను తిరిగి వెనక్కి పంపిస్తారేమో అని భయాందోళనకు గురవుతున్నారు.. అమెరికాలో ఉన్న యూనివర్సిటీలపై విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం, కన్సల్టెన్సీలు చెప్పిన వాటిపైనే ఆధారపడటం వల్ల విద్యార్థులకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్యుమెంటేషన్లో పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేయలేకపోవడం వల్ల అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారు. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల సైతం యూనివర్సిటీ డీటెయిల్స్ ని వెరిఫై చేసి ఏ కోర్సులో విద్యార్థి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు వాటి గురించి పూర్తి వివరాలు సేకరించుకోవాలి. చదవాలనుకున్న కోర్స్ పై క్లారిటీతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకుని ఉండాలి. అప్పుడే విద్యార్థికి ఇటువంటి సమస్య రాదు.

ఈ మూడింటికి సమాధానాలు చెబితే చాలని అంటున్నారు. అమెరికాకు వెళ్తున్న విద్యార్థులు డిపోర్టేషన్‌కు గురికాకుండా ఉండాలంటే మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే చాలు అంటున్నారు నిపుణులు.

1. అమెరికాలో ఏ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారు.

2. చదువుకునే రోజుల్లో ఎక్కడ ఉండబోతున్నారు.

3. చదువుకు కావాల్సిన ఫీజ్ ఎలా కడతారు.

ఈ మూడింటికి సరైన సమాధానం విద్యార్థి దగ్గర ఉంటే అతడికి ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు. ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య డాక్యుమెంటేషన్ లోనే..కన్సల్టెన్సీలు ఇస్తున్న డాక్యుమెంటేషన్ ను ఇలాంటి మార్పులు చేసుకోకుండా యధావిధిగా దాన్ని తీసుకెళ్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులు. నానా కష్టాలు పడి అప్పులు తెచ్చి, మరికొందరు తమ ఆస్తులను అమ్మి తమ పిల్లలు విదేశాల్లో చదవాలని ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకుంటుటారు. డాక్యుమెంటేషన్ సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆ డాక్యుమెంటేషన్ కారణంగానే చాలామంది తెలుగు విద్యార్థులను మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపిస్తున్నట్టు సమాచారం. కేవలం కన్సల్టెన్సీలో ఇచ్చే డాక్యుమెంటేషన్ కాకుండా విద్యార్థులు సొంతంగా గ్రౌండ్ వర్క్ చేయాల్సిందిగా యూఎస్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..