Medical Student Suicide: ‘సారీ అమ్మా..’ వైజాగ్‌లో మెడికల్ స్టూడెంట్ సూసైడ్ కలకలం
కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ అనే యువతి.. చైనాలో ఎంబిబిఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చింది. ఆ తర్వాత ఈనెల 13న ఇంటి నుంచి తిరుగు ప్రయాణమైంది. 18వ తేదీన విశాఖ చేరుకున్న ఆ మెడికో డాబా గార్డెన్స్ లోని లాడ్జి గదిలో అద్దెకు దిగింది.. ఆగస్టు 9వ తేదీన గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మళ్లీ తిరిగి..
అమరావతి, ఆగస్టు 25: కేరళకు చెందిన మెడికల్ విద్యార్ధిని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకుంది. లాడ్జి గదిలో ఉరి వేసుకుని యువతి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హోటల్ గదిలో సూసైడ్ నోట్ లభించింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సూసైట్ నోట్‌లో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ అనే యువతి.. చైనాలో ఎంబిబిఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చింది. ఆ తర్వాత ఈనెల 13న ఇంటి నుంచి తిరుగు ప్రయాణమైంది. 18వ తేదీన విశాఖ చేరుకున్న ఆ మెడికో డాబా గార్డెన్స్ లోని లాడ్జి గదిలో అద్దెకు దిగింది.. ఆగస్టు 9వ తేదీన గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మళ్లీ తిరిగి ఈనెల 24వ తేదీన విద్యార్ధిని రమేష్ కృష్ణ అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉన్న.. ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చింది. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు లాడ్జి నిర్వాహకులు.
టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి తలుపును విరగొట్టి లోపలికి వెళ్లారు. లాడ్జి గదిలో ఫ్యానుకు ఉడివేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది మెడికో. పక్కనే మలయాళం భాషలో పదాలను ఇంగ్లీషులో రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’అంటూ ఆ సూసైడ్ లో ఉన్నట్టు టూ టౌన్ సిఐ తిరుమలరావు చెబుతున్నారు. అయితే మెడికో.. ఈ నెల 19న చెక్ అవుట్ చేసిన తర్వాత ఈనెల 23 వరకు ఎక్కడికి వెళ్లిందని పోలీసులు ఆరాతిస్తున్నారు. కుటుంబ సభ్యులు వచ్చాక వారిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.