చెప్పులతో ఐసీయూలోకి రావొద్దన్నందుకు బీజేపీ నేత హల్‌చల్‌.. ఆసుపత్రి కూల్చేందుకు బుల్డోజర్‌ రప్పించి

బీజేపీ నేత, లక్నో మేయర్ సుష్మా ఖారక్వాల్‌ నగరంలోని వినాయక్ మెడికేర్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోకి షూతో సోమవారం (ఆగస్టు 21) ప్రవేశించబోయింది. వెంటనే అక్కడ ఉన్న వైద్యులు ఆమెను షూ తొలగించి లోపలికి వెళ్లమని కోరారు. దీనితో ఆగ్రహించిన మేయర్‌ సుష్మా.. నన్నే అడ్డుకుంటారా.. అంటూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి ఆసుపత్రి కూల్చేందుకు మేయర్‌..

చెప్పులతో ఐసీయూలోకి రావొద్దన్నందుకు బీజేపీ నేత హల్‌చల్‌.. ఆసుపత్రి కూల్చేందుకు బుల్డోజర్‌ రప్పించి
BJP Mayor calls bulldozer to raze hospital
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 24, 2023 | 7:57 AM

లక్నో, ఆగస్టు 24: ఆసుపత్రి ఐసీయూలోకి చెప్పులతో రావొద్దన్నందుకు నగర మేయర్‌ వైద్యులపై చిందులు తొక్కారు. సదరు ఆసుపత్రిని కూల్చేందుకు వెంటనే ఫోన్‌ చేసి బుల్డోజర్‌ను రప్పించి హల్‌ చల్‌ చేసింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

బీజేపీ నేత, లక్నో మేయర్ సుష్మా ఖారక్వాల్‌ నగరంలోని వినాయక్ మెడికేర్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోకి షూతో సోమవారం (ఆగస్టు 21) ప్రవేశించబోయింది. వెంటనే అక్కడ ఉన్న వైద్యులు ఆమెను షూ తొలగించి లోపలికి వెళ్లమని కోరారు. దీనితో ఆగ్రహించిన మేయర్‌ సుష్మా.. నన్నే అడ్డుకుంటారా.. అంటూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి ఆసుపత్రి కూల్చేందుకు మేయర్‌ సిద్దమైంది. బెదిరింపులకు దిగిన లక్నో బీజేపీ మేయర్‌ వెంటనే ఫోన్‌లో తన అనుచరులతో మాట్లాడి దవాఖానపైకి బుల్డోజర్‌ను తీసుకురావల్సిందిగా మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని ఆమె ఆదేశించింది. దీంతో వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కాగా లక్నోలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి ఐసీయూలో మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఆర్మీ బ్రిగేడ్ నుంచి రిటైర్డ్ జవాన్ సురేన్‌ కుమార్‌ చికిత్స పొందుతున్నాడు. ఆయన్ని పరామర్శించేందుకు లక్నో మేయర్‌ సుష్మా ఖారక్వాల్‌ ఆసుపత్రికి వెళ్లారు. మేయర్‌ సుష్మాతో పాటు ఆమె అనుచరులు పదుల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు చెప్పులు, బూట్లతో ఐసీయూలోకి వెళ్లబోయారు. వైద్య సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. పాదరక్షలు విడిచి ఐసీయూలోకి రావాలని తాము మర్యాద పూర్వకంగానే కోరామని, కానీ మేయర్ వాగ్వాదానికి దిగారని హాస్పిటల్‌ యాజమాన్యం పోలీసులకు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల