Youtube: యూట్యూబ్ చూస్తూ భార్యకు ప్రసవం చేసిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చాలామంది యూట్యాబ్‌కు మంచి ప్రజాధారణ దక్కింది. వినోదం కోసం, ఏదైన కొత్త సమాచారం తెలుసుకోవడం కోసం యూట్యూబ్‌లోని వీడియోలను ప్రతిరోజూ కోట్లాది మంది వీక్షిస్తున్నారు. అలాగే తమకు ఏదైన సమస్య వచ్చిన కూడా వాటి పరిష్కారం కోసం యూట్యూబ్‌ పైనే ఆధారపడుతున్నారు. అయితే తమిళనాడులో ఓ వ్యక్తి చేసిన ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. యూట్యూబ్ వీడియో చూసి తన భార్యకు ప్రసవం చేయడంతో ఆమె మృతి చెందడం కలకలం రేపింది.

Youtube: యూట్యూబ్ చూస్తూ భార్యకు ప్రసవం చేసిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే
Loganayaki
Follow us
Aravind B

|

Updated on: Aug 24, 2023 | 7:33 AM

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చాలామంది యూట్యాబ్‌కు మంచి ప్రజాధారణ దక్కింది. వినోదం కోసం, ఏదైన కొత్త సమాచారం తెలుసుకోవడం కోసం యూట్యూబ్‌లోని వీడియోలను ప్రతిరోజూ కోట్లాది మంది వీక్షిస్తున్నారు. అలాగే తమకు ఏదైన సమస్య వచ్చిన కూడా వాటి పరిష్కారం కోసం యూట్యూబ్‌ పైనే ఆధారపడుతున్నారు. అయితే తమిళనాడులో ఓ వ్యక్తి చేసిన ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. యూట్యూబ్ వీడియో చూసి తన భార్యకు ప్రసవం చేయడంతో ఆమె మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణగిరి జిల్లాలోని పోచంపల్లి సమీపంలో పులియాంపట్టి అనే గ్రామంలో లోకనాయకి అనే మహిళ ఉండేది . ఆమెకి 2021లో అనుమంతపురం గ్రామానికి చెందిన మాదేశ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే మాదేశ్ తన గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడి భార్య ఇటీవలే గర్భం దాల్చింది.

దీంతో ఆమె భర్త మాదేశ్ ఓ కొత్త ఆలోచన చేశాడు. సేంద్రియ పద్ధతి లాగే తన భార్యకు కూడా ఎలాంటి మందుల సహాయం లేకుండానే సహజ పద్ధతిలో ప్రసవం జరగాలని భావించాడు. ఇందుకోసం లోకనాయకికి కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించలేదు. అయితే స్థానికంగాంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ మాదేశ్ మాత్రం వారి మాట వినలేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రసవ సమయంలో కూడా ప్రభుత్వం అందించేటటువంటి వ్యా్క్సిన్లతోపాటుగా పౌష్టికాహారాన్ని కూడా నిరాకరించాడు. అతడే తన భార్యకు గింజలు, ఆకుకూరలు లాంటివి ఆహారంగా అందించేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీన ఇంట్లో లోకనాయకి ఉంది. అయితే ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి.

ఇది గమనించి భర్త మాదేశ్ యూట్యూబ్‌లో చూస్తూ తన భార్యకు ప్రసవం అయ్యేలా చేశాడు. చివరికి ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు సరైన రీతిలో వైద్యం అందలేదు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో భర్త మాదేశ్ ఇక చేసేదేం లేక కన్నియర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే లోకనాయకి మరణించింది. దీంతో భర్త మాదేశ్ షాకయ్యాడు. ఇక పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు యూట్యూబ్‌లో చూసి భార్యకు ప్రసవం చేయడం ఏంటని చాలామంది ఆశ్యర్యం  వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..