Pooja Hegde: కడప నగరంలో సందడి చేసిన బుట్టబొమ్మ .. పట్టు చీరలంటే చాలా ఇష్టం అంట..

కడప నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది .. ఆకార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సినీ హీరోయిన్ బుట్చబొమ్మ పూజా హెగ్డే వస్తుందని గత వారంరోజులుగా ప్రచారం జరగడంతో కడపలో ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.. ఈరోజు ఉదయం తిరుపతి చేరుకున్న పూజా రోడ్డు మార్గం ద్వారా కడప నగరానికి చేరుకుని షాపింగ్ మాల్ ను ప్రారంభించారు..

Pooja Hegde: కడప నగరంలో సందడి చేసిన బుట్టబొమ్మ .. పట్టు చీరలంటే చాలా ఇష్టం అంట..
Pooja Hegde
Follow us
Sudhir Chappidi

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 25, 2023 | 10:04 PM

అలా వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్ తో మరింత క్రేజ్ తెచ్చుకున్న హిరోయిన్ పూజా హెగ్డే .. ఈరోజు కడప నగరంలో సందడి చేశారు .. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పూజా ఈజు కడప కు వస్తున్నారని తెలియడంతో అభిమానులు భారీగా ఆమెను చూసేందుకు షాపింగ్ మాల్ వద్దకు తరలి వచ్చారు. కడప నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది .. ఆకార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సినీ హీరోయిన్ బుట్చబొమ్మ పూజా హెగ్డే వస్తుందని గత వారం రోజులుగా ప్రచారం జరగడంతో కడపలో ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.. ఈరోజు ఉదయం తిరుపతి చేరుకున్న పూజా రోడ్డు మార్గం ద్వారా కడప నగరానికి చేరుకుని షాపింగ్ మాల్ ను ప్రారంభించారు..

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం రోజు షాపింగ్ మాల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని , మహిళలకు సంభందించి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ లభించనున్నాయని పూజా తెలిపారు .. శ్రావణ మాసం కావజంతో మహిళలు కూడా పెద్ద ఎత్తున షాపింగ్ చేసేందుకు తరలి వచ్చారు .

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

పట్టుచీరలంటే చాలా ఇష్టం..

మోడ్రన్ డ్రస్సులకంటే పట్టుచీరలంటే తనకు చాలా ఇష్టమని ప్రమఖ హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు .. కడప నగరంలోని సౌత్ ఇండిసా షాపిెగ్ మాల్ 32 వ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఆమె ప్రారంభోత్సవం తరువాత మీడియాతో మాట్లాడుతూ నాకు పట్టు చీరలంటే చాలా ఇషటమని , మోడ్రన్ డ్రస్సులు చూసేందుకు బాగుంటాయి కానీ చీరలో ఉన్న అందం డ్రస్సులలో ఉండదని పూజా అన్నారు. అందుకే పార్టీలలో చాలా వరకు చీరలకే ప్రాధాన్యత ఇస్తానని పూజా అన్నారు .. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మహిళలందరికి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియచేశారు హీరోయిన్ పూజా హెగ్డే.

Pooja Hegde In Kadapa

Pooja Hegde In Kadapa

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.