- Telugu News Photo Gallery Cinema photos Tollywood Heroines Varalakshmi Vratham Celebrations, Saree Pics Goes Viral telugu cinema news
Varalakshmi Pooja: అందాల తారల వరలక్ష్మీ వ్రతం వేడుకలు.. పట్టు చీరల్లో మెరిసిన బాపు బొమ్మలు..
శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నారు టాలీవుడ్ హీరోయిన్స్, సెలబ్రెటీస్. సంప్రదాయాలు, సంస్కృతిని గౌరవించే మన నటీమణులు పట్టుచీరలో.. సంప్రదాయ అభరణాలు ధరించి వరమహాలక్ష్మి పూజ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
Updated on: Aug 25, 2023 | 8:53 PM

శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నారు టాలీవుడ్ హీరోయిన్స్, సెలబ్రెటీస్. సంప్రదాయాలు, సంస్కృతిని గౌరవించే మన నటీమణులు పట్టుచీరలో.. సంప్రదాయ ఆభరణాలు ధరించి వరమహాలక్ష్మి పూజ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ పట్టుచీరలో బాపు బొమ్మలా ముస్తాబయ్యింది. పట్టుచీర, పాపిట బిళ్ల పెట్టుకుని.. ఆకట్టుకునే కళ్లు.. అందమే అసూయ పడేట్టుగా హిందుత్వం ఉట్టిపడే విధంగా ప్రణీత రెడీ అయ్యింది. ఈ అందమైన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలిపారు.

బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా మారింది ప్రణవి మానుకొండ. ఇటీవలే స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసిన ప్రణవి ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం నెట్టింట షేర్ చేసిన ఫోటో మంత్రముగ్దులను చేస్తుంది. అమిగోస్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఆషికా.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.





























