TS DSC Notification 2023: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. 523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సర్కార్ ఉత్తర్వులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సర్కార్‌ ఆగస్టు 24 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 ఎస్‌జీటీ పోస్టులు, 1739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆగస్టు 25న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ..

TS DSC Notification 2023: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. 523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సర్కార్ ఉత్తర్వులు
TS DSC Notification 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 27, 2023 | 7:29 AM

హైదరాబాద్‌, ఆగస్టు 27: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సర్కార్‌ ఆగస్టు 24 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 ఎస్‌జీటీ పోస్టులు, 1739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆగస్టు 25న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరో 1523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు ఆ పోస్టులను మంజూరు చేస్తున్నట్లు (శనివారం) ఆగస్టు 26 జీఓ జారీ చేసింది. ఈ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను కూడా పాఠశాల విద్యాశాఖ నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) ద్వారా భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో ప్రాథమిక పాఠశాలల్లో 796 పోస్టులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 727 పోస్టులను మంజూరు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18,857 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. తాజాగా మంజూరు చేసిన పోస్టుల్లో నల్గొండ జిల్లాకు అత్యధికంగా 91 పోస్టులు, సిరిసిల్ల జిల్లాకు అతి తక్కువగా 20 పోస్టులను మంజూరు చేశారు.

జిల్లాల వారీగా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల వివరాలిలా..

  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 84
  • రంగారెడ్డి జిల్లాలో పోస్టుల సంఖ్య: 78
  • సూర్యాపేట జిల్లాలో పోస్టుల సంఖ్య: 74
  • కామారెడ్డి జిల్లాలో పోస్టుల సంఖ్య: 72
  • నిజామాబాద్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 69
  • సంగారెడ్డి జిల్లాలో పోస్టుల సంఖ్య: 65
  • కొత్తగూడెం జిల్లాలో పోస్టుల సంఖ్య: 56
  • ఖమ్మం జిల్లాలో పోస్టుల సంఖ్య: 56
  • యాదాద్రి జిల్లాలో పోస్టుల సంఖ్య: 55
  • హైదరాబాద్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 54
  • మెదక్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 53
  • సిద్దిపేట జిల్లాలో పోస్టుల సంఖ్య: 52
  • వికారాబాద్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 49
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 43
  • నిర్మల్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 40
  • జగిత్యాల జిల్లాలో పోస్టుల సంఖ్య: 39
  • ఆదిలాబాద్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 38
  • జనగామ జిల్లాలో పోస్టుల సంఖ్య: 38
  • వరంగల్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 37
  • మహబూబాబాద్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 36
  • వనపర్తి జిల్లాలో పోస్టుల సంఖ్య: 36
  • మంచిర్యాల జిల్లాలో పోస్టుల సంఖ్య: 34
  • గద్వాల జిల్లాలో పోస్టుల సంఖ్య: 31
  • నారాయణపేట జిల్లాలో పోస్టుల సంఖ్య: 31
  • కరీంనగర్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 30
  • హనుమకొండ జిల్లాలో పోస్టుల సంఖ్య: 30
  • మేడ్చల్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 30
  • పెద్దపల్లి జిల్లాలో పోస్టుల సంఖ్య: 27
  • ఆసిఫాబాద్‌ జిల్లాలో పోస్టుల సంఖ్య: 26
  • భూపాలపల్లి జిల్లాలో పోస్టుల సంఖ్య: 25
  • ములుగు జిల్లాలో పోస్టుల సంఖ్య: 24

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.