Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అంత కష్టం ఏం వచ్చింది నాన్నా..’ 17 నెలల చిన్నారిని చంపి, తండ్రి ఆత్మహత్యాయత్నం

అల్లారు ముద్దుగా చూసే తండ్రే చిన్నారి నిండు జీవితాన్ని బలితీసుకున్నాడు. కేరింతలు కొడుతూ తండ్రి చుట్టూ తిరిగే బిడ్డను నిర్దాక్షిణ్యంగా బావిలో తోసి కడతేడర్చాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ గొడవలతో మనస్తాపం చెంది ఈ దారుణానికి ఒడిగట్టినట్లు..

'అంత కష్టం ఏం వచ్చింది నాన్నా..' 17 నెలల చిన్నారిని చంపి, తండ్రి ఆత్మహత్యాయత్నం
Devansh And Tirupati Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 27, 2023 | 8:38 AM

పెద్దపల్లి, ఆగస్టు 27: అల్లారు ముద్దుగా చూసే తండ్రే చిన్నారి నిండు జీవితాన్ని బలితీసుకున్నాడు. కేరింతలు కొడుతూ తండ్రి చుట్టూ తిరిగే బిడ్డను నిర్దాక్షిణ్యంగా బావిలో తోసి కడతేడర్చాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ గొడవలతో మనస్తాపం చెంది ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటన ఎలిగేడు మండలం రాములపల్లిలో శనివారం చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ, కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల ప్రకారం..

రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి(30)కు మానసతో వివాహం జరిగింది. వీరికి దేవాన్ష్‌ అనే 17 నెలల కొడుకు ఉన్నాడు. తిరుపతిరెడ్డికి అతని సోదరుడు రత్నాకర్‌రెడ్డికి మధ్య భూ వివాదమై విభేదాలు ఉన్నాయి. ఈ విషయమై రత్నాకర్‌రెడ్డి మామ తరపు బంధువులు పలుమార్లు తిరుపతిరెడ్డిని చంపేస్తామని బెదిరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన తిరుపతిరెడ్డి దాదాపు ఏడాది కాలంగా కుటుంబంతో సుల్తానాబాద్‌లో కాపురం ఉంటున్నాడు. శుక్రవారం వరలక్ష్మీ పూజ కావడంతో భార్య మానస, కొడుకు దేవాన్ష్‌తో కలిసి స్వగ్రామంలో ఉంటోన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ మురుసటి రోజు అంటే శనివారం కూడా మరోసారి కొడుకు దేవాన్ష్‌ను తీసుకొని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. ఏం జరిగిందో తెలియదుగానీ నేరుగా పొలం వద్దకు వెళ్లి చిన్నారిని బావిలో తోశాడు. అనంతరం తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తమామల వద్దకు వెళ్లిన భర్త మధ్యాహ్నం అయినా తిరిగిరాకపోవడంతో మానస మామ సంజీవరెడ్డికి ఫోన్‌ వాకబు చేసింది. మామ సంజీవరెడ్డి తమ ఇంటికి రాలేదని చెప్పాడు. అనంతరం ఆయన పొలం వద్దకు వెళ్లి చూడగా బావి ఒడ్డుపై అపస్మారక స్థితిలో పడిఉన్న తిరుపతిరెడ్డి కనిపించాడు.

మనవడి కోసం చుట్టూ గాలించాడు. ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి బావిలో చూశాడు. నీళ్లపై చిన్నారి చెప్పులు తేలియాడుతూ కనిపించడంతో వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలోని నీటిని మోటార్లతో తోడి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. తిరుపతిరెడ్డిని హుటాహుటీన సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తిరుపతిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. అతని భార్య మానస ఫిర్యాదు మేరకు పోలీసులు రత్నాకర్‌రెడ్డి, అతని మామ సత్తిరెడ్డి, బావమరిది లక్ష్మణ్‌లపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.