AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: 119 నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి ఏంటీ..? కమలదళం ఇచ్చే గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉండనుంది..

Telangana BJP Politics: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని ఆలోచిస్తున్న భారతీయ జనతా పార్టీ.. వ్యూహాలకు పదునుపెట్టి దూసుకెళ్తోంది. అసలు గ్రౌండ్ లెవల్లో ప్రజల నాడి ఎలా ఉంది..? ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? లేదా..? ఈ క్రమంలో ఎలాంటి లోపాలున్నాయి. నియోజకవర్గాల్లో పల్స్.. రాష్ట్ర కమిటీ పనితీరు ఎలా ఉంది..? ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది..

Telangana BJP: 119 నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి ఏంటీ..? కమలదళం ఇచ్చే గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉండనుంది..
Telangana BJP
Shaik Madar Saheb
|

Updated on: Aug 27, 2023 | 11:03 AM

Share

Telangana BJP Politics: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని ఆలోచిస్తున్న భారతీయ జనతా పార్టీ.. వ్యూహాలకు పదునుపెట్టి దూసుకెళ్తోంది. అసలు గ్రౌండ్ లెవల్లో ప్రజల నాడి ఎలా ఉంది..? ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? లేదా..? ఈ క్రమంలో ఎలాంటి లోపాలున్నాయి. నియోజకవర్గాల్లో పల్స్.. రాష్ట్ర కమిటీ పనితీరు ఎలా ఉంది..? ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది.. ఎవరు ఎలాంటి వారు.. ఇదంతా గ్రౌండ్ లెవల్ రిపోర్ట్.. కానీ ఇదే కావాల్సింది.. అందుకే రహస్యంగా.. అదంతా బయటకు కనిపించడకుండా లోపలే మేనేజ్‌ చేశారు. వారం రోజులుగా వాళ్లంతా తెలంగాణలోని నియోజకవర్గాల్లో తిరిగారు.. బీజేపీకి పబ్లిక్‌లో రూట్‌ లెవెల్లో ఎలా ఉందో ఇన్ఫర్మేషన్‌ సేకరించారు. పార్టీకి ప్లస్సులు.. మైనస్సులు ఏంటో ఇవాళ అమిత్‌ షాకు రిపోర్ట్‌ ఇవ్వనున్నారు. వాళ్ల ఫీడ్‌ బ్యాక్‌ మొత్తం అమిత్‌ షాకు అందజేయనున్నారు. దీని ప్రకారమే.. అధిష్టానం.. మరో ప్లాన్ కూడా సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల టైమ్​ దగ్గర పడుతుండడంతో ఈసారి ఎలాగైనా తెలంగాణలో జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను బీజేపీ హైకమాండ్ పంపించింది. ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, కర్నాటక, పుదుచ్చేరి, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు వారం కిందటే తెలంగాణలో దిగారు.. వాళ్లంతా వారం రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లోనే ఉన్నారు.. ఇవాళ జరిగే అమిత్ షా మీటింగుకు హాజరవుతారు..

వీళ్ల పనేంటంటే.. పార్టీ లోకల్ లీడర్లు, మండల, బూత్ స్థాయి కార్యకర్తలను కలిసి మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి? పార్టీ బలోపేతం, బూత్ కమిటీల పనితీరు, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఉన్న అవకాశాలు, టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? తదితర విషయాలపై హైకమాండ్​కు నివేదిక అందజేస్తారు. ఆ నివేదికల ఆధారంగానే హైకమాండ్ రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను రచించనుంది.

బండిని తప్పించడంపై నెగటివ్‌ రిపోర్ట్‌

అయితే.. తెలంగాణలోని ఏ మూలకెళ్లినా.. పబ్లిక్‌.. బండి సంజయ్‌ మేటరే గుర్తు చేస్తున్నారట.. బండిని తప్పించడంపై నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మరో మెయిన్‌ పాయింట్‌ ఏంటంటే.. కవిత విషయంలో కేంద్ర పెద్దలు వ్యవహరించిన తీరుపైనా పబ్లిక్‌ మండిపడుతున్నారట..ఈ రెండు తెలంగాణ బీజేపీకి పెద్ద మైనస్‌ పాయింట్లుగా..ఎమ్మెల్యేలతో జనం చెబుతున్నారట.. ఈ విషయాలే అమిత్‌ షా చెవిలో పడేయాలని.. వాళ్లంతా తహతహలాడుతున్నారని టాక్.. మరి ఈ రిపోర్ట్‌పై ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో..ఏమో.. గానీ.. బీజేపీ ఎమ్మెల్యే రిపోర్ట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..