‘భారతీయుల ఆయుష్శు తగ్గిపోతోంది.. దానిని వెంటనే కంట్రోల్ చేయండి’ WHO హెచ్చరిక

రోడ్లపై వాహనాలు విడుదల చేసే కాలుష్యం మన ఆయుష్శు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. భారతీయుల వయసు సగటున 5.3 సంవత్సరాల వయసు తగ్గిపోతుందని పేర్కొంది. వాహనాలు ఫైన్ పార్టిక్యులేట్ (PM2.5) వాయు కాలుష్యం మూలంగా..

‘భారతీయుల ఆయుష్శు తగ్గిపోతోంది.. దానిని వెంటనే కంట్రోల్ చేయండి’ WHO హెచ్చరిక
Air Pollution
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 30, 2023 | 2:10 PM

న్యూ ఢిల్లీ, ఆగస్టు 30: రోడ్లపై వాహనాలు విడుదల చేసే కాలుష్యంతో మన ఆయుష్శు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. భారతీయుల వయసు సగటున 5.3 సంవత్సరాల వయసు తగ్గిపోతుందని పేర్కొంది. వాహనాలు ఫైన్ పార్టిక్యులేట్ (PM2.5) వాయు కాలుష్యం మూలంగా భారతీయుల ఆయుర్దాయం క్షీణించే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తాజాగా ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలోని జాతీయ పరిసర వాయు నాణ్యతా ప్రమాణాలు 5 మైక్రోగ్రాముల పర్ క్యూబిక్ మీటర్ (µg/m3)గా ఉంది. ఇది 40 µg/m3 చేరుకోకపోతే సగటున 1.8 సంవత్సరాల ఆయుర్దాయ ప్రమాదం ఉన్నట్లు నివేధిక వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరంగా దేశ రాజధాని ఢిల్లీకి పేరున్న సంగతి తెలిసిందే. ఇది ఇలాగే కొనసాగితే దేశ రాజధాని ఢిల్లీలో నివసించేవారి ఆయుష్శు ఏకంగా 11.9 ఏళ్లు కోల్పోవచ్చని నివేదిక పేర్కొంది.

ప్రపంచంలో రెండవ అత్యంత కలుషిత నగరంగా గుర్గావ్‌ ఉంది. అక్కడ వాయు కాలుష్యం ఘోరంగా క్షీణిస్తోంది. గుర్గావ్‌లో 11.2 సంవత్సరాలు ఆయుక్షీణం, ఫరీదాబాద్‌లో 10.8 సంవత్సరాలు, జౌన్‌పూర్ (ఉత్తరప్రదేశ్)లో 10.1 సంవత్సరాలు, లక్నో, కాన్పూర్‌లో 9.7 సంవత్సరాలు, ముజఫర్‌పూర్ (బీహార్‌లో) 9.2 సంవత్సరాలు, ప్రయాగ్‌రాజ్ లో 8.8 సంవత్సరాలు, పట్నాలో 8.7 సంవత్సరాలు ఆయుక్షీణం ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. ఇక దేశ వ్యాప్తంగా దాదాపు1.3 బిలియన్లకు పైగా ప్రజలు సగటు వాయు కాలుష్య స్థాయి ప్రమాణాలను మించి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు నివేదిక తెల్పింది. దేశ జనాభాలో 67.4 శాతం మంది ఇలాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారట.

AQLI నివేదిక ప్రకారం, భారత్ లో రేణువుల కాలుష్యం మూలంగా కార్డియోవాస్కులర్ వ్యాధుల ముప్పు అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఫలితంగా సగటు ఆయుర్దాయం సుమారు 4.5 సంవత్సరాలు తగ్గుతున్నట్లు పేర్కొంది. పోషకాహార లోపంతో 1.8 సంవత్సరాల ఆయుష్శు క్షీణిస్తోంది. కాగా నేడు ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం (PM2.5) మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. దీంతో ఆయుక్షీణ ప్రమాణ గణాంకాలు ప్రతీయేట పడిపోతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సగటు ఆయుర్దాయం 2.3 సంవత్సరాలు తగ్గుతోంది. దక్షిణాసియాలో 2013 నుంచి 2021 వరకు వాయు కాలుష్యం 9.7 శాతం పెరిగింది. మన దేశంలో వాయు కాలుష్యం స్థాయిలు 9.5 శాతం పెరిగాయి. పాకిస్థాన్‌లో 8.8 శాతం, బంగ్లాదేశ్‌లో అత్యధికంగా 12.4 శాతం పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..