నింగి-నేల-నీటిపై ఏకకాల దాడి.. గర్జనకు సిద్ధమైన భారత సముద్ర సింహం INS దూనగిరి!
చైనా, పాకిస్తాన్ కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత నౌకాదళం సరికొత్త బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా.. 'విజయమే నా వృత్తి' అనే నినాదంతో 'INS దూనగిరి' సముద్రంలోకి దూకుతోంది. ప్రాజెక్ట్ 17A కింద తయారైన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ లోగోను ఆవిష్కరించారు. రాడార్లకు చిక్కకుండా.. నింగి, నేల, నీటిపై ఏకకాలంలో దాడి చేయగలదు ఈ సముద్ర సింహం.

చైనా, పాకిస్తాన్ కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత నౌకాదళం సరికొత్త బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా.. ‘విజయమే నా వృత్తి’ అనే నినాదంతో ‘INS దూనగిరి’ సముద్రంలోకి దూకుతోంది. ప్రాజెక్ట్ 17A కింద తయారైన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ లోగోను ఆవిష్కరించారు. రాడార్లకు చిక్కకుండా.. నింగి, నేల, నీటిపై ఏకకాలంలో దాడి చేయగలదు ఈ సముద్ర సింహం.
భారత నౌకాదళంలో చేరబోతున్న ఐదో ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ ‘INS దూనగిరి’ కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు.. అదొక సముద్రపు అజేయ బ్రహ్మాస్త్రం! రామాయణంలోని సంజీవని పర్వత పౌరాణిక నేపథ్యం.. శత్రువును చీల్చిచెండే వేట పక్షి వ్యూహం.. వీటికి తోడు భూమిపైన, ఆకాశంలో, సముద్రంపైన ఉన్న శత్రువులపై దాడి చేయగల అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలు ఈ నౌక సొంతం.
ఐఎన్ఎస్ దూనగిరి.. ఈ పేరు వెనుక ఒక గొప్ప హిస్టరీ ఉంది. స్వామి హనుమ తెచ్చిన సంజీవని పర్వతం ఇదే. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉందిది. కాలక్రమంలో ఇదే దూనగిరిగా మారింది. ఇక ఈ దూనగిరి లోగోలో హిమాలయ పర్వతాల పైనుంచి ఎగురుతున్న ఆస్ప్రే అనే వేట పక్షిని చూపించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే.. మెరుపు వేగంతో దూసుకెళ్లి, గురి తప్పకుండా సముద్రంలో ఉన్న శత్రువును సర్జికల్ స్ట్రైక్‌తో వేటాడటం ఈ పక్షి స్పెషాలిటీ. ఇప్పుడు మన ఐఎన్ఎస్ దూనగిరి యుద్ధనౌక కూడా అదే పవర్‌తో నింగి, నేల, నీరు మార్గాల్లో శత్రువును నిర్మూలించడానికి సిద్ధమైంది.
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ నిర్మించిన ఈ అత్యాధునిక గైడెడ్-మిసైల్ స్టెల్త్ ఫ్రిగేట్.. 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. అ భారీ యుద్ధనౌక.. దాదాపు 6,670 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. రెండు పవర్‌ఫుల్ గ్యాస్ టర్బైన్లు, రెండు డీజిల్ ఇంజన్ల సాయంతో గరిష్టంగా గంటకు సుమారు 52 కిలోమీటర్ల వేగంతో సముద్రపు అలలను చీల్చుకుంటూ దూసుకెళ్లగలదు.
‘విజయమే నా వృత్తి’ అనే నినాదంతో బరిలోకి దిగుతున్న ఈ నౌక ఆయుధ సామర్థ్యం శత్రువులకు సింహస్వప్నం. దీనిపై ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను అమర్చారు. ఇవి సముద్రం లేదా భూమిపై ఉన్న శత్రువుల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి. అలాగే, ఆకాశం నుంచి వచ్చే ముప్పులను గాల్లోనే తుత్తునియలు చేయడానికి బరాక్-8 లాంటి లాంగ్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది.
సముద్రగర్భంలో దాక్కునే శత్రువుల జలాంతర్గాములను వేటాడటానికి ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టోర్పెడో లాంచర్లు, యాంటీ-సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లను అమర్చారు. ఈ నౌకకున్న అతిపెద్ద బలం దీని స్టెల్త్ డిజైన్. దీని ప్రత్యేక ఆకృతి వల్ల శత్రువుల రాడార్ సిగ్నల్స్ దీనిని గుర్తించలేవు. అదే సమయంలో, ఇందులో ఉన్న అధునాతన MF-STAR రాడార్ వ్యవస్థ.. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల కదలికలను ముందే పసిగడుతుంది.
గతంలో 1977 నుంచి 2010 వరకు 33 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించి రిటైర్ అయిన ‘INS దూనగిరి’ వారసత్వాన్ని పునికిపుచ్చుకుంటూ, అంతకంటే వంద రెట్లు ఎక్కువ రక్షణాత్మక వ్యూహాలతో ఈ సరికొత్త దూనగిరి రూపుదిద్దుకుంది. దాదాపు 75 శాతం స్వదేశీ టెక్నాలజీతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారైన ఈ నౌకపై రెండు మల్టీ-రోల్ హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వడానికి వీలుగా పెద్ద హెలి-డెక్‌ను కూడా డిజైన్ చేశారు. టెక్నికల్‌గానూ, వ్యూహాత్మకంగానూ దూనగిరి ఇక సముద్ర గర్భంలో తిరుగులేని శక్తిగా మారబోతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
