June 12, 2026
Subhash
భారతీయులకు అత్యంత ఇష్టమైన వంటకాల్లో బిర్యానీ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానముంది. ఏదైనా పార్టీ ఉందంటే బిర్యానీ తప్పకుండా ఉండాల్సిందే.
బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్ తాగితే అదో మజా అని ఫీలవుతుంటారు చాలా మంది. అందుకే చ ఆలా మంది రెస్టారెంట్లలో బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్ కూడా తాగుతుంటారు.
బిర్యానీ, కూల్ డ్రింక్స్ కాబినేషన్స్ మీద ఆఫర్లు కూడా ఉంటాయి. మరి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగొచ్చా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
బిర్యానీని హాట్‌గా తింటాం. దానికి కాంబినేషన్‌గా కూల్ డ్రింక్స్ తాగుతుంటాము. దీని వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియకు మంచిది కాదంటున్నారు.
బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అసిడిటీ పెరిగి కడుపు సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బిర్యానీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మసాలాలు అధికంగా ఉంటాయి. అలాగే కూల్ డ్రింక్స్‌లో అధికంగా షుగర్, కెఫిన్ ఉంటుంది. దీంతో ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు.
కూల్ డ్రింక్స్, బిర్యానీ కాంబినేషన్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలకు ఇది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందంటున్నారు.
అందుకే ఎప్పుడూ కూడా బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్ తాగొద్దని వైద్యులు పదేపదే హెచ్చరిస్తుంటారు. ఈ రెండింటిని ఒకేసారి తీసుకోకపోవడం మంచిది కాదని గుర్తించుకోండి.