గుడ్డును ఎంతసేపు ఉడికించాలి? ఈ తప్పులు చేస్తే జరిగేది ఇదే..
Krishna
12 June 2026
గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక సంపూర్ణ ఆహారం. ముఖ్యంగా ఉడికించిన గుడ్లు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. అయితే వాటి నుండి పూర్తి పోషకాలు లభించాలంటే ఉడకబెట్టే విధానం సరిగ్గా ఉండాలి.
సూపర్ ఫుడ్
గుడ్డును ఎంతసేపు ఉడకబెట్టాలనేది మీరు తినేదానిపై ఆధారపడి ఉంటుంది. మీకు గుడ్డు లోపలి సొన మెత్తగా కావాలంటే 10 నుండి 12 నిమిషాలు, అదే గట్టిగా ఉడకాలనుకుంటే 12 నుండి 15 నిమిషాల పాటు ఉడికించడం మంచిది.
ఎంత సమయం
గుడ్డును ఎక్కువ సేపు ఉడికించడం వల్ల లోపలి పచ్చసొన చుట్టూ ఆకుపచ్చ, నలుపు రంగు పొర ఏర్పడుతుంది. ఇది రుచిని, ఆకృతిని మార్చేస్తుంది. ఇది రావొద్దంటే నీటిని ముందుగా వేడి చేసి, ఆ తర్వాత గుడ్లు వేయాలి.
ఆకుపచ్చ పొర
గుడ్లు ఉడికిన వెంటనే వాటిని వేడి నీటి నుండి తీసి, ఆలస్యం చేయకుండా ఐస్ వాటర్ లేదా చల్లటి నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు లోపల ఉడికే ప్రక్రియ వెంటనే ఆగిపోవడమే కాకుండా పెంకు చాలా సులభంగా వస్తుంది.
పెంకు
ఉడికించిన గుడ్లలో నాణ్యమైన లీన్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల, బరువు నియంత్రణకు పనిచేస్తుంది. దీంతో పాటు విటమిన్ ఎ, డి, ఇ, కె లతో పాటుజింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి.
విటమిన్ల గని
ఒక ఉడికించిన గుడ్డులో కేవలం 70-78 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడికించిన గుడ్లు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి, రోజంతా అనవసరపు కేలరీలు తీసుకోకుండా అడ్డుకుంటుంది.
బరువు తగ్గడం
చాలామంది బరువు తగ్గాలని పచ్చసొనను పారేస్తుంటారు. కానీ గుడ్డులోని విటమిన్ డి, బి12, కోలిన్ వంటి కీలక పోషకాలన్నీ పచ్చసొనలోనే ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు అందుతాయి.
పచ్చసొన
గుడ్డులో ఉండే కోలిన్ అనే మూలకం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులోని లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను నివారించి, చూపును మెరుగుపరుస్తాయి.