AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Pratyusha Suicide: ‘చిన్నారి పెళ్లికూతురు’ నటి ప్రత్యూష సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె ప్రియుడి అభ్యర్ధనను తిరస్కరించిన కోర్టు

టీవీ నటి ప్రత్యూష బెనర్జీ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించడంలో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ సింగ్ హస్తం ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను ముంబైలోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. 2016లో టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్న రాహుల్..

Actress Pratyusha Suicide: ‘చిన్నారి పెళ్లికూతురు’ నటి ప్రత్యూష సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె ప్రియుడి అభ్యర్ధనను తిరస్కరించిన కోర్టు
Actress Pratyusha Banerjee
Srilakshmi C
|

Updated on: Sep 02, 2023 | 2:11 PM

Share

టీవీ నటి ప్రత్యూష బెనర్జీ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించడంలో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ సింగ్ హస్తం ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను ముంబైలోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. 2016లో టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్న రాహుల్ ఈ ఆరోపణల నుంచి తనకు విముక్తి కల్పించాలని కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అయితే రాహుల్ సింగ్ ఆశలపై నీళ్లు చల్లిన కోర్టు అతని అభ్యర్ధనను తిరస్కరించడమే కాకుండా రాహుల్ వల్లే ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే ప్రత్యూష జీవితాన్ని రాహుల్ నాశనం చేశాడని వ్యాఖ్యానించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి సమీర్ అన్సారీ (దిండోషి కోర్టు) ఆగస్టు 14న రాహుల్ సింగ్ డిశ్చార్జ్ దరఖాస్తును తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దాని వివరణాత్మక ఉత్తర్వులు బుధవారం (ఆగస్టు 30) విడుదల చేశారు.

కేసు కోసం ఎదురుచూడడానికి ఎనిమిదేళ్లు పట్టింది.. ప్రత్యూష తండ్రి శంకర్

ప్రత్యూష తండ్రి శంకర్ మాట్లాడుతూ.. ‘మన వ్యవస్థ గురించి నేను ఏమి చెప్పగలను. ఈ కేసు ప్రారంభం కావడానికి ఎనిమిదేళ్లు పట్టింది. ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కోర్టు ఎవరి సొత్తు కాదు. అక్కడ అన్నీ నిజాలే ప్రతి నిజం బయటకు వస్తుంది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నామో నా భార్యకు నాకు తెలుసు. నిందితుడికి శిక్ష పడటమే మా జీవితం ఏకైక లక్ష్యం. కొన్ని ఫేక్ మీడియా సంస్థలు నిజాన్ని వక్రీకరించి చెబుతున్నాయి. మమ్మల్ని విలన్‌లుగా చూపిస్తున్నారు. దీని వల్ల మా ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. కోర్టు విచారణలో నిందితుడు నా కూతుర్ని చంపాడని రుజువవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఇప్పటికే నేను నా కూతురుతో సహా అన్నీ కోల్పోయాను. ఇప్పుడు నా కూతురు హక్కుల కోసం పోరాడుతున్నాను. నా ఒక్కగానొక్క కూతురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇకపై చాలా నిజాలు బయటకు రాబోతున్నాయి. నా ఈ బాధ ఏ తల్లితండ్రులు అనుభవించకూడదు. తదుపరి విచారణ నవంబర్‌లో జరగనుంది’ అని నటి ప్రత్యూష మీడియాతో మాట్లాడారు.

కాగా నటి ప్రత్యూష బెనర్జీ బాలికా వధు సీరియల్లో ఆనంది పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2016 ఏప్రిల్ 1న ముంబైలోని గొరెగాన్ ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను ప్రత్యూష ప్రేమించుకున్నామని 2016లో వివాహం చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు. ఐతే తన నిర్ణయంపై తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడం వల్లనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు సింగ్ తెలిపాడు. అంతేకాకుండా కూతురు సంపాదనతో తల్లిదండ్రులు జల్సాలు చేసుకునే వారని ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ కేసును విచారించిన కోర్టు రాహుల్ వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదని నిర్ధారించింది. పైగా ప్రత్యూషను శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా వేధనకు గురిచేసినట్లు కోర్టు విశ్వసించింది. తదుపరి విచారణ అక్టోబర్ 8న జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.