Khushi First Day Collections: రికార్డు వసూళ్లతో దుమ్ము రేపుతోన్న ‘ఖుషి’.. విజయ్‌- సామ్‌ల సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందంటే..

లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 1న అడియన్స్ ముందుకు వచ్చింది. పాటలు, ట్రైలర్ తో సినిమాపై క్యూరియాసిటి కలిగించగా.. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామ్, విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ అందుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాకు

Khushi First Day Collections: రికార్డు వసూళ్లతో దుమ్ము రేపుతోన్న 'ఖుషి'.. విజయ్‌- సామ్‌ల సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందంటే..
Kushi Movie First Day Collections
Follow us

| Edited By: Basha Shek

Updated on: Sep 02, 2023 | 9:04 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం ఖుషి. మహానటి సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 1న అడియన్స్ ముందుకు వచ్చింది. పాటలు, ట్రైలర్ తో సినిమాపై క్యూరియాసిటి కలిగించగా.. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామ్, విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ అందుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. నివేదికల ప్రకారం ఈ సినిమా యావత్ దేశవ్యాప్తంగా రూ.16 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 59.13 % ఆక్యుపెన్నీని, తమిళంలో 40.12%లో ఆక్యుపెన్సీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ శని, ఆదివారాల్లో ఈ సినిమా మరింత వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈసినిమా కోసం విజయ్ దేవరకొండ రూ.23 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికిగానూ సామ్ రూ.4.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని ఆరాధ్య, నా రోజా నువ్వే పాటలకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటివరకు రూ.16 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.9.50 నుంచి 10 కోట్ల షేర్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.14 కోట్లు రాబట్టినట్లుగా టాక్.

 విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

కాగా విజయ్‌ దేవరకొండ నటించిన గత మూడు సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. ముఖ్యంగా పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చిన లైగర్‌ భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఖుషి విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయం అతనికే కాదు శాకుంతలం ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న సమంతకు కూడా డబుల్ జోష్‌నిస్తోంది. ఖుషి సినిమా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగింది. అయితే మొదటి మూడు రోజుల్లోనే 35 కోట్లకు పైగా షేర్ వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్న విజయ్ ఖాతాలో ఖుషి సినిమాతో మరో డీసెంట్ సూపర్ హిట్ పడిందనే చెప్పుకొవాలి. దీంతో శుక్రవారం సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నోట్ షేర్ చేశారు విజయ్. ఇక ఈ సినిమాతో విజయ్ కు సాలిడ్ కమ్ బ్యాక్ వచ్చినట్లే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అలీ, రోహిణి, మురళీ శర్మ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లకు సామ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ సమస్యకు చికిత్స కోసం అమెరికా వెళ్లిన సామ్.. అక్కడి నుంచి సోషల్ మీడియా వేదికగా ఖుషి ప్రమోషన్లలో పాల్గొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కలలో కారు కనిపించిందా.? మీ జీవితంలో ఈ మార్పు జరగబోతున్నట్లే
కలలో కారు కనిపించిందా.? మీ జీవితంలో ఈ మార్పు జరగబోతున్నట్లే
ఓ పక్క దీక్ష.. మరో పక్క పని.! దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్..
ఓ పక్క దీక్ష.. మరో పక్క పని.! దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్..
ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు
ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు
Employment crisis in USA: అమెరికాలో ఐటీ ఉద్యోగులకు భయం భయం!
Employment crisis in USA: అమెరికాలో ఐటీ ఉద్యోగులకు భయం భయం!
'నిరుద్యోగ యువత పక్షాన అసెంబ్లీని స్తంభింపజేస్తాం'.. మాజీ మంత్రి
'నిరుద్యోగ యువత పక్షాన అసెంబ్లీని స్తంభింపజేస్తాం'.. మాజీ మంత్రి
రేపట్నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షురూ.. జులై 19 నుంచి తరగతులు
రేపట్నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షురూ.. జులై 19 నుంచి తరగతులు
అలర్ట్‌.. ఈ రోజే చివరి గడువు.. ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత
అలర్ట్‌.. ఈ రోజే చివరి గడువు.. ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత
రుతుపవనాల రాకతో ఉత్తర భారతంలో భారీ వర్షాలు..!
రుతుపవనాల రాకతో ఉత్తర భారతంలో భారీ వర్షాలు..!
ఇలాంటివి తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట.. బీకేర్‌ఫుల్
ఇలాంటివి తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట.. బీకేర్‌ఫుల్
రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ సెహ్వాగ్..
రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ సెహ్వాగ్..