Maanas: పెళ్లిపీటలెక్కనున్న ‘బ్రహ్మముడి’ ఫేం మానస్‌.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరో తెలుసా?

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న సీరియల్‌ బ్రహ్మముడి. టీఆర్పీ రేటింగ్‌లోనూ ఈ ధారావాహిక దూసుకుపోతోంది. ముఖ్యంగా రాజ్‌- కావ్యల జోడీకి బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే బ్రహ్మముడి సీరియల్‌తో బోలెడు క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు నటుడు మానస్‌. రాజ్‌ పాత్రలో అతని నటన అందరినీ ఆకట్టుకుంటోంది.

Maanas: పెళ్లిపీటలెక్కనున్న 'బ్రహ్మముడి' ఫేం మానస్‌.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Maanas Engagement
Follow us
Basha Shek

|

Updated on: Sep 02, 2023 | 6:39 PM

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న సీరియల్‌ బ్రహ్మముడి. టీఆర్పీ రేటింగ్‌లోనూ ఈ ధారావాహిక దూసుకుపోతోంది. ముఖ్యంగా రాజ్‌- కావ్యల జోడీకి బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే బ్రహ్మముడి సీరియల్‌తో బోలెడు క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు నటుడు మానస్‌. రాజ్‌ పాత్రలో అతని నటన అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు మానస్‌. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్‌లలో ఒకడిగా నిలిచాడు. అయితే బ్రహ్మముడి సీరియల్‌తోనే బోలెడు క్రేజ్‌, అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ బ్రహ్మముడి నటుడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా మానస్‌ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీజ నిశ్శంకర్‌ రావుతో అతని నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్‌మెంట్ ఎక్కడ జరిగిందో కానీ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే మానస్‌ కూడా తన ఎంగేజ్‌మెంట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బ్రహ్మముడి సీరియల్స్‌ గ్రూప్‌లో మానస్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు, వీడియోలు తెగ దర్శనమిస్తున్నాయి.

ఈ ఫొటోస్‌, వీడియోల్లో ఎంతో అందంగా కనిపించారు శ్రీజ, మానస్‌. వైలెట్‌ కలర్‌ డ్రెస్‌లో కాబోయే వధూవరులు ఎంతో క్యూట్‌గా కనిపించారు. ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మానస్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ వీజే సన్నీ, ఆర్జే కాజల్‌, నటి తేజస్వినితో పాటు పలువురు నటీనటులు ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో సందడి చేశారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం మానస్‌- శ్రీజలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ మెరిశాడు మానస్‌. సోడా గాలిసోడా, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజా కాయ్‌ వంటి సినిమాల్లో నటుడిగా మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

మానస్ – శ్రీజల ఎంగేజ్ మెంట్..

ఎంగేజ్ మెంట్ లో సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీలు..

శుభాకాంక్షల వెల్లువ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే